వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎందుకింత నిర్లక్ష్యం?...కేబినెట్ మీటింగ్ లో అధికారులపై సిఎం చంద్రబాబు సీరియస్

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అమరావతి:గురువారం సచివాలయంలో జరిగిన కేబినెట్ మీటింగ్ లో అధికారుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

Recommended Video

అమరావతి బాండ్లకు కేబినెట్ ఓకే

ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా సంక్షేమ పథకాలను అమలు చేయలని చూస్తుంటే మీరు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవమరిస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. ముఖ్యంగా ముఖ్యంగా ఆక్వా రైతుల అంశానికి సంబంధించి చర్చ జరిగే సమయంలో అధికారులను సిఎం గట్టిగా నిలదీశారని తెలిసింది.

మత్స్య శాఖ అధికారులపై...సిఎం ఆగ్రహం

మత్స్య శాఖ అధికారులపై...సిఎం ఆగ్రహం

ఏపి క్యాబినెట్ సమావేశంలో కొన్ని శాఖల అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రభుత్వ శాఖల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆక్వా రైతుల అంశం విషయమై చర్చ సందర్భంగా సిఎం చంద్రబాబు మత్స్య శాఖ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం, ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈశాన్య రాష్ట్రాలలో ఏపీ ఆక్వా ఉత్పత్తులపై నిషేధం విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది.

అయినా...ఇంత నిర్లక్ష్యమా?

అయినా...ఇంత నిర్లక్ష్యమా?

ఒక పక్క కేంద్రం మనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసి కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. చేపలు నిషేధం బారిన పడకుండా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదంటూ సీఎం నిలదీయడంతో సంబంధిత అధికారుల నుంచి మౌనమే సమాధానం అయిందట.
అలాగే ఆక్వా రైతులకు కరెంట్ ఛార్జీల తగ్గింపుపైనా మంత్రివర్గంలో విస్తృత చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ఛార్జీల తగ్గింపుకు...ఆదేశం

ఛార్జీల తగ్గింపుకు...ఆదేశం

ఆక్వా రైతులకు కరెంట్ ఛార్జీలను తగ్గించాలని వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి కోరగా స్పందించిన సీఎం కరెంట్ ఛార్జీలు తగ్గించి యూనిట్ కి రూ. 2 మాత్రమే వసూలు చేయాలని అధికారులను అప్పటికప్పుడే ఆదేశించారు. ఐతే దీనికి ఆర్ధికపరమైన ఇబ్బందులు వస్తాయని ఆర్ధిక శాఖ అధికారులు సిఎంకు తెలిపారట. అయితే కష్టమైనా భరిద్దామని...ఆక్వా రైతులు ఇప్పటికే అనేక రకాలుగా నష్టపోవడం వల్ల ఎలాగోలా ఆదుకోవడం మానేసి కొర్రీలు వేయాలని చూడడం సరికాదని సీఎం వారితో అన్నట్లుగా తెలుస్తోంది.

మెరైన్ వర్సిటీ...జాప్యంపై నిలదీత

మెరైన్ వర్సిటీ...జాప్యంపై నిలదీత

ఆక్వా రైతులను ఆదుకునే విషయమై సీఎం సానుకూల స్పందనతో వారికి కరెంట్ ఛార్జీలను తగ్గించాలనే నిర్ణయంపై మంత్రిమండలి సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. అయితే మూడేళ్లుగా మెరైన్ యూనివర్సిటీ విషయంలో తన ఆదేశాలను అధికారులు పట్టించుకోకపోవడంపై సంబంధిత మంత్రి, అధికారులపై సీఎం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారట. మెరైన్ వర్సిటీ ఏర్పాటుపై మూడేళ్లుగా నివేదిక ఎందుకివ్వలేదని సూటిగా ప్రశ్నించారట. ఇకనైనా సాకులు చెప్పడం మాని పని చేయాలని సీఎం చంద్రబాబు గట్టిగానే మందలించారని తెలిసింది.

English summary
Amaravati: CM Chandrababu has expressed his displeasure over the officers in the cabinet meeting on Thursday. That the ban on AP Aqua products was imposed due to authorities negligence, says CM Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X