అరుదైన గౌరవం: చంద్రబాబుకు అంతర్జాతీయ అవార్డు, కాలిఫోర్నియాకు ఆహ్వానం

Subscribe to Oneindia Telugu

అమరావతి: తెలుగుదేం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడుకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. చంద్రబాబుకు 'యూఎస్‌ఐబీసీ ట్రాన్ప్‌ఫర్మెటివ్‌ చీఫ్‌ మినిస్టర్‌' అవార్డు అందజేయనున్నట్లు యూఎస్‌-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రకటించింది.

మే 8న అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగే కార్యక్రమంలో కీలకోపన్యాసం చేయాలని చంద్రబాబుకు ఆహ్వానం పంపారు. ఈ కార్యక్రమంలో 150కి పైగా పైగా సాంకేతిక దిగ్గజ సంస్థలు పాల్గొననున్నాయి. విభజన అనంతరం లోటు బడ్జెట్‌ రాష్ట్రాన్ని సమర్థవంతంగా అభివృద్ధి దిశగా నడిపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబుకు ఈ అవార్డు దక్కింది.

CM Chandrababu Gets USIBC"s Transformative Chief Minister Award

అసెంబ్లీలోనే ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి వేదిక ఖరారైంది. అసెంబ్లీ ఆవరణలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ ప్రారంభం రోజు సభ నిర్వహించిన ప్రదేశంలోనే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నుంచి సాధారణ పరిపాలన శాఖకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. ఆదివారం ఉదయం 9.25 గంటలకు కొత్త మంత్రులతో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu had got USIBC"s Transformative Chief Minister Award.
Please Wait while comments are loading...