కుప్పంలో ఇంత జరిగినా పట్టించుకోరా?, మిమ్మల్ని ఏం చెయ్యాలి, సీఎం చంద్రబాబు సీరియస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సొంత నియోజకవ కుప్పంలో జరిగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంపై సంబంధిత గనుల శాఖ అధికారులపై మండిపడ్డారని తెలిసింది. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం ముద్దనపల్లె రెవెన్యూ పరిధిలో, సి. బండపల్లి పరిధిలో అక్రమంగా నిర్వహించిన క్వారీల విషయంలో అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది.
ముదనపల్లె రెవెన్యూలోని సర్వేనెంబర్ 144 లో సుమారు 660 ఎకరాల విస్తీర్ణంలోని అడవిలో అక్రమంగా విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో గత వైసీపీ ప్రభుత్వంలో సుమారు 30 మంది అక్రమంగా క్వారీలు నిర్వహించారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీకి చెందిన ఓ మాజీ మంత్రి మనుషులు అక్రమంగా లక్షల లక్షల రూపాయలు వసూలు చేసి వైసీపీ నాయకులు అక్రమంగా క్వారీలు నిర్వహించుకోవడానికి అనుమతులు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి.

అక్రమ క్వారీలు నిర్వహిస్తున్న వారు ప్రతి సంవత్సరం రూ. 50 వేల నుండి లక్ష రూపాయల వరకు ఆ వైసీపీ పెద్దాయనకు ముడుపులు చెల్లించుకున్నారని, ఇంత అక్రమ అవ్యవహారాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా సైలెంట్ గా ఉండిపోయారని కుప్పం నియోజక వర్గం ప్రజలు చంద్రబాబు నాయుడుకు సమాచారం ఇచ్చారు. ఈ వ్యవహారం గురించి అప్పట్లో చంద్రబాబు నాయుడుకు తెలిసినా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆ ఆక్రమ క్వారీలను అడ్డుకోలేక పోయారని తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, సీఎంగా చంద్రబాబు నాయుడు ఉండటంతో కుప్పం నియోజకవర్గం లోని అటవీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ గనుల వ్యవహారంపై దృష్టి సారించారు. అటవి ప్రాంతంలో వందల ఎకరాల అక్రమంగా క్వారీలు నిర్వహించినా అప్పటి ఆంధ్రప్రదే గనుల శాఖ మాజీ ఎండి వెంకట్ రెడ్డి ఆ అక్రమ క్వారీలు నిర్వహించిన అందరికీ క్లీన్ చిట్ ఇచ్చేశారని వెలుగు చూసింది.

కుప్పం నియోజకవర్గానికి చెందిన ఓ వైసీపీ నాయకుడు మదనపల్లెలో కూడా అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్నారని వెలుగు చూసింది. పలమనేరు నియోజకవర్గంలోని ఓ వైసీపీ నాయకుడు కూడా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అక్రమంగా క్వారీలో నిర్వహిస్తున్నారని వెలుగు చూసింది. సొంత జిల్లాలోనే అక్రమ గల నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో సీఎం చంద్రబాబు నాయుడు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ లో వరదల్లో దెబ్బతిన్న ప్రాంతాల గురించి, వరదబాదితుల గురించి వివరాలు సేకరిస్తున్న సీఎం చంద్రబాబు ఇదే సమయంలో కుప్పం నియోజక వర్గంతో పాటు చిత్తూరు జిల్లాలో అక్రమంగా నిర్వహించిన క్వారీల విషయంలోనూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో సంబంధిత అధికారులు హడలిపోయారని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డి పరారిలో ఉండటంతో ఆయన చిక్కితేనే కుప్పం వ్యవహారంలో కూడా ఓ క్లారిటీ వస్తుందని సంబంధిత అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications