CM Chandrababu: రూటు మార్చిన చంద్రబాబు, సంచలన నిర్ణయాలతో పాలనలోనూ CBN మార్క్.. తగ్గేదేలే!!

ఏపీ సీఎం గా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కార్య క్షేత్రంలోకి దిగారు. రెట్టింపు కసితో పని చేయాలని ఏపీ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటిరోజు నుంచే చంద్రబాబు తన మార్కు పాలనను కొనసాగిస్తున్నారు. సీఎంగా సెక్రటేరియట్ లో బాధ్యతలు చేపట్టిన తొలినాడే ఐదు ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేసిన చంద్రబాబు, మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి చంద్రబాబు కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తమకు అధికారాన్ని కట్టబెట్టి పాలనా పగ్గాలు అప్పగించినందుకు కృతజ్ఞతగా చంద్రబాబు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమరావతి రాజధానిలోని సచివాలయంలో దాదాపు ప్రతీరోజూ తాను అందుబాటులో ఉంటానని తేల్చి చెప్పారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తాను సచివాలయంలోనే ఉండనున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమయంలో ఎవరు వచ్చినా తనను కలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

CM Chandrababu key decisions Focus on Polavaram project Chandrababu mark in governance

పోలవరంపై చంద్రబాబు ఫోకస్
అంతేకాదు చంద్రబాబు కలల ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కూడా చంద్రబాబు ఫోకస్ చేస్తున్నారు. 2014 2019 మధ్య పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించే క్రమంలో ప్రతి సోమవారం ప్రాజెక్టు ప్రాంతం వద్దకు వెళ్లి పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు చంద్రబాబు. అయితే ఇప్పుడు కూడా ప్రతి సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్టు సైట్ కు వెళ్ళనున్నారు.

రాజీ పడేది లేదు
పోలవరం పనులను యుద్ధ ప్రాతిపదిక ముందుకు తీసుకువెళ్లాలని, త్వరితగతిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని, ఈ విషయంలో రాజీ పడేది లేదని ఇప్పటికే ఉన్నతాధికారులకు చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇటు ప్రజా సమస్యల పరిష్కారంలో కూడా అధికారులు, మంత్రులు ఎవరూ అలసత్వం ప్రదర్శించకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు.

మంత్రులకు చంద్రబాబు సూచన
పూర్తి పారదర్శకతతో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. ఇక మంత్రులకు కొన్ని సూచనలు చేసిన చంద్రబాబు మంత్రులందరూ తమ తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని సూచించారు. అంతేకాదు తమ నియోజకవర్గాలకు జిల్లాలకు వెళ్లి అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకుని రావాలని ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు.

అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి చంద్రబాబు తపన
ప్రతి ఒక్కరు సమయపాలన కచ్చితంగా పాటించాలని, డైరీ మెయింటైన్ చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఏపీలో గత ఐదేళ్ల పాలనలో కుంటుపడిన అభివృద్ధిని మళ్లీ తమ హయాంలో చూపించాలని చంద్రబాబు తపన పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సీఎంగా పని మొదలుపెట్టేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+