ఏపీ రాజ్‌భవన్ ఎట్ హోం.. చంద్రబాబు, పవన్ హాజరు, రఘురామ ముచ్చట
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌లో 'ఎట్ హోం' కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ టీ పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి సహా పలువురు మంతరులు, ప్రముఖులు హాజరయ్యారు.
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హైకోర్టు న్యాయమూర్తులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, నారాయణ, పార్థసారథి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సవిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎస్, డీజీపీ, ఇతర సీనియర్ అధికారులు, రాజకీయ పార్టీల నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు పలు అంశాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు. 76వ గణతంత్ర దినోత్సవానికి రాజభవన్ ప్రాంగణాన్ని పూలు, విద్యుత్ దీపాలంకరణతో అందంగా అలంకరించారు. కాగా, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు సీఎం చంద్రబాబుతో కొద్దిసేపు చర్చించారు. సీఎం చంద్రబాబు దంపతులు, గవర్నర్ అబ్దుల్ నజీర్, హైకోర్టు సీజే, పవన్ కల్యాణ్ ఒకే చోట కూర్చుని ఆతిథ్యాన్ని స్వీకరించారు.
Chief Justice of High Court of Andhra Pradesh Sri Justice Dhiraj Singh Thakur, Dy. Chief Minister Sri K. Pawan Kalyan, Ministers, Judges & Registrars of AP High Court, MPs, MLCs, MLAs, and other dignitaries have graced the occasion. pic.twitter.com/cKFaunL8Jx
— governorap (@governorap) January 26, 2025
మరోవైపు, క్రీడాకారులు మంత్రి నారా లోకేష్‌తో కొద్దిసేపు మాట్లాడారు. ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకటరావు, గద్దె రామ్మోహన్, శ్రీరామ్ తాతయ్య, మండలి బుద్ధ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, ప్రజా ప్రతినిధులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సీపీఐ రామకృష్ణ, వివిధ పార్టీల ముఖ్యనేతలు, క్రీడాకారులు అథ్లెట్ వై.జ్యోతి, కోనేరు హంపి తదితరులు హాజరయ్యారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమైన ఎట్ హోం కార్యక్రమం గంటన్నరపాటు కొనసాగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ గవర్నర్ జస్టిస్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన "ఎట్ హోం" కార్యక్రమంలో పాల్గొన్నాను.#RepublicDay pic.twitter.com/ZQNOCMWM2W
— K Raghu Rama Krishna Raju (RRR) (@KRaghuRaju) January 26, 2025
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications