తిరుమలకు మద్యం, గంజాయి సరఫరా ?, సీఎం చంద్రబాబు దెబ్బకు వాళ్లకు టెన్షన్ !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తిరుమల సాక్షిగా చెబుతున్నా టీటీడీ నుంచి ప్రక్షాళన చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడం హాట్ టాపిక్ అయ్యింది. చంద్రబాబు ప్రకటనతో 2019 నుంచి నెల రోజుల ముందు వరకు వీవీఐపీ దర్శనాల పేరుతో లూటీలు చేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి..
గురువారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తరువాత మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు ఓ మాట అన్నారు. తిరుమలలో విచ్చలవిడిగా గంజాయి, మద్యం సరఫరా అవుతోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ప్రపంచ స్థాయిలో తిరుమలకు ఇంకా ప్రత్యేక గుర్తింపు తీసుకు వస్తామని, దేశ విదేశాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రకటించారు.

.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగిన చంద్రబాబు నాయుడు ఎస్వీ యూనివర్శిటీలో చదువుతున్న రోజుల్లోనే విద్యార్థి సంఘం నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు.. తిరుపతి సమీపంలోని చంద్రగిరిలో పుట్టిన నారా చంద్రబాబు నాయుడు మొదటి సారి అదే చంద్రగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. తరువాతే చంద్రబాబు కుప్పం నియోజక వర్గానికి మారారు.
ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని పెళ్లి చేసుకోవడంతో టీడీపీలోకి జంప్ అయ్యారు. తిరుపతికి చంద్రగిరికి పెద్ద దూరం లేదు. సీఎంగా ఉన్న సమయంలో, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తిరుపతి, చంద్రగిరితో పాటు చిత్తూరు జిల్లా గురించి చంద్రబాబు పూర్తి సమాచారం తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు జగన్ సీఎం అయిన తరువాత చంద్రబాబు హైదరాబాద్ లో ఎక్కువగా ఉన్నా తిరుపతి మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన చిన్నాన వైవీ సుబ్బారెడ్డి రెండు సార్లు అంటే దాదాపు నాలుగు సంవత్సరాలు టీటీడీ చైర్మన్ గా పని చేశారు. వైవీ సుబ్బారెడ్డి తరువాత అప్పటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు.. వైఎస్. జగన్ కుటుంబ సభ్యులు టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలోనే తిరుమలలో అక్రమాలు జరిగాయని టీడీపీ నాయకులు అప్పటి నుంచి ఆరోపణలు చేస్తున్నారు.
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదం అయిన తిరుమల లడ్డూల నాణ్యత తగ్గిందని, భక్తులకు అందించే అన్నప్రసాదాలు సక్రమంగా లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయం తిరుమలలో ఈరోజు గుర్తు చేసిన చంద్రబాబు ఇక ముందు తిరుమల ప్రసాదంతో పాటు అన్నప్రసాదాలు నాణ్యతగా ఉంటాయని, అందులో ఎలాంటి రాజీ ఉండని స్పష్టం చేశారు. ఇదే సమయంలో టీటీడీలోని కొందరు అధికారులకు చంద్రబాబు పరోక్షంగా వార్నింగ్ కూడా ఇచ్చారు.

తాను తిరుమలలో దేవుడి సాక్షిగా చెబుతున్నాను, టీటీడీ నుంచి తన ప్రక్షాళన మొదలుపెడుతానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. తిరుమలలో గంజాయి, మద్యం విచ్చలవిడిగా దొరుకుతోందని, శ్రీవారి సన్నిధిలో ఇలాంటి పాపాలు చేస్తున్న వారికి దేవుడు సరైన శిక్ష వేస్తాడని చంద్రబాబు అన్నారు. సీఎం చంద్రబాబు దగ్గర ఎలాంటి సమాచారం లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడరని, ఆయన పూర్తి సమాచారం సేకరించి ఉంటారని తిరుపతికి చెందిన నాయకులు అంటున్నారు.
ఇంతకాలం అధికారం అడ్డం పెట్టుకుని తిరుమలకు మద్యం, గంజాయి సరఫరా చేసిన వారి గురించి చంద్రబాబు ఆరా తీస్తున్నారని, అతి త్వరలో చంద్రబాబు ప్రభుత్వం వాళ్లకు సినిమా చూపిస్తుందని తిరుపతి ప్రజలు అంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు నాయకులు తిరుమలకు మద్యం, గంజాయి సరఫరా చేశారని సమాచారం సేకరించిన టీడీపీ నాయకులు ఆ విషయం చంద్రబాబుకు చెప్పారని, అందుకే ఆయన తిరుమలలో ఇలాంటి ప్రకటన చేశారని తెలిసింది. ఇప్పుడు తిరుమలకు మద్యం, గంజాయి సరఫరా చేసిన బ్యాచ్ కు దడ పుడుతోందని తెలిసింది.
-
రాములవారి సేవలో శ్రీవారి సేవకులు, అరుదైన ఘట్టం - కన్నుల పండువగా..!! -
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
Dry Day: మందు బాబులకు షాక్.. వాహనదారులకు అలర్ట్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications