వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు షాక్: టీడీపీలో చేరిన గుత్తుల, చంద్రబాబు పవర్ పంచ్‌లు

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, తూర్పుగోదావరి జిల్లా ముమ్మడిరం ఇంఛార్జ్ గుత్తుల వెంకట సాయి శ్రీనివాసరావు, భారీ సంఖ్యలో ఆయన అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ కండువా కప్పిన ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గుత్తుల సాయిని పార్టీలోకి ఆహ్వానించారు.

అదో ఉన్మాద పార్టీ..

అదో ఉన్మాద పార్టీ..

ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ ఓ ఉన్మాది పార్టీ అని, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నోటికి వచ్చింది మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఓసారి నడిరోడ్డులో కాల్చేస్తానంటారు.. ఉరితీస్తానంటారు.. పట్టుకుని తంతానంటారంటూ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. రాష్ట్రలకు ఏం చేయాలో తెలుసని అన్నారు.

Recommended Video

Nandyal By polls : Chandrabab Naidu Vs YS Jagan, What You Need to Know
జగన్ ఓ దౌర్భాగ్యం..

జగన్ ఓ దౌర్భాగ్యం..

గతంలో ఓసారి విశాఖపట్నం వెళ్లి గొడవ చేసి.. అక్కడి పోలీసులు, అధికారులనే బెదిరింపులకు గురిచేశారని జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను జగన్మోహన్ రెడ్డిలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడలేనని అన్నారు. అతడు మన రాష్ట్రంలో ఉండటం మన దౌర్భాగ్యమని చంద్రబాబు అన్నారు.

తండ్రే భరించలేకపోయాడు..

తండ్రే భరించలేకపోయాడు..

జగన్ లాంటి వ్యక్తిని తన రాజకీయ జీవితంలో చూడలేదని అన్నారు. తాను రాష్ట్రం కోసమే మాటలు పడుతున్నానని చంద్రబాబు తెలిపారు. జగన్ ను ఆయన తండ్రి కూడా భరించలేకపోయాడని, అందుకే బెంగళూరు పంపించారని ఎద్దేవా చేశారు. కానీ, మనం ఇప్పుడు అతడ్ని భరించాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు.

బాధ కలుగుతోంది..

బాధ కలుగుతోంది..

రాజకీయాల్లో హుందాతనం అవసరమని చంద్రబాబు చెప్పారు. తప్పులుంటే విమర్శించాలని, కానీ, ఇష్టానుసారంగా మాట్లాడితే బాధ కలుగుతోందని చంద్రబాబు అన్నారు. జగన్ ఉన్మాద మాటలను పట్టించుకోమని చంద్రబాబు స్పష్టం చేశారు.

2018 వస్తే తన రాజకీయ జీవితం 40ఏళ్లకు చేరుతుందని అన్నారు. దేవుడి ఆశీస్సులతో తాను అన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నాని చెప్పారు.

గుత్తులకు సముచిత స్థానం..

గుత్తులకు సముచిత స్థానం..

గుత్తుల సాయికి టీడీపీలో సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

జిల్లాలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ ఉన్న వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని చెప్పారు. కార్యకర్తలు రాష్ట్రాన్ని శక్తివంతంగా తయారు చేయాలని పిలుపునిచ్చారు. తాను ఒక్కడినే కష్టపడితే సరిపోదని, అందరం కలిసి చేస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. అందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోందని చెప్పారు. కేంద్రం నిధులు విడుదల చేస్తే పోలవరం నిర్మాణం త్వరితగతిన పూర్తవుతుందని చంద్రబాబు తెలిపారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Monday satirical comments on YSRCP president YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X