ఏమిటిది, బాగా లేదు, ఇన్నాళ్లు చేసింది ఇదేనా!: మంత్రి నారాయణపై బాబు ఆగ్రహం?

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలోని తన కార్యాలయం బాగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారా? అంటే కావొచ్చుననే వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై మంత్రి నారాయణ, సీఆర్డీఐ కమిషనర్ పైన అసహనం వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తోందని అంటున్నారు.

బాబు లాక్కోవడం వెనుక పెద్ద ప్లాన్, అలా ఐతే ఏడాదిలో ఎన్నికలు: బాంబు పేల్చిన జగన్

బుధవారం నాడు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలోని తన కార్యాలయం నుంచి చంద్రబాబు విధులను ప్రారంభించారు. అయితే, కార్యాలయంలో అడుగుపెట్టిన అనంతరం చంద్రబాబు.. కార్యాలయం ఏమాత్రం బాగా లేదని, నాణ్యత లేదని వ్యాఖ్యానించారని అంటున్నారు.

chandrababu naidu

ఇన్ని రోజుల పాటు ఇక్కడ కూర్చొని ఏర్పాటు చేసిన కార్యాలయం ఇదేనా అని ప్రశ్నించారని వార్తలు వస్తున్నాయి. హైదరాబాదు సచివాలయంలోని డి బ్లాకును ఎల్ అండ్ టి సంస్థ నిర్మించిందని, అక్కడ బాగా నిర్మించిన ఆ సంస్థ వెలగపూడిలో ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారని చెబుతున్నారు.

కాగా, మెట్రో నగరాలకు దీటుగా రాజధాని అమరావతిలో ఇన్నర్, ఔటర్, ప్రాంతీయ రహదారుల నిర్మాణం చేపట్టాలని చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. అనంతరం సచివాలయంలో సీఆర్డీఐ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that, CM Chandrababu Naidu starts functioning from Velagapudi.
Please Wait while comments are loading...