ఉచిత బస్సు పథకంపై చంద్రబాబు మరో కీలకనిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది ప్రభుత్వం. ఆగస్ట్ 15వ తారీఖున ప్రారంభమైన ఈ స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏపీలో మహిళలతో విశేషంగా ఆదరణ పొందుతుంది. రాష్ట్రవ్యాప్తంగా బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి ఈ పథకం వల్ల బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది.

ఏపీలో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని వినియోగించుకుంటున్న మహిళలు
ఇక ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో బస్సు ప్రయాణ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్న మహిళలు ఎంతో మంది ఉన్నారు. ఇక ఉచిత బస్సు ప్రయాణానికి ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుందని చెప్పిన విషయం తెలిసిందే. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇలా ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ సాఫ్ట్ కాపీ చూపించిన సరిపోతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

cm Chandrababu Naidu takes another key decision on the free bus scheme with smart cards

స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఆర్థిక వెసులుబాటు
ఇక ఈ స్త్రీ శక్తి పథకంలో మహిళల ప్రయాణాలతో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. జీరో ఫెయిర్ టికెట్ ద్వారా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని భావిస్తున్నారు. ఇక తాజాగా స్త్రీ శక్తి పథకం అమలులో మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం .

ఆరు రోజుల్లో 65లక్షల మంది ప్రయాణాలు
ఇప్పటికే ఆరు రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని 65 లక్షల మందికి పైగా మహిళలు వినియోగించుకున్నారు. దీంతో త్వరలో మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బస్సులో ఈజీగా ప్రయాణం చేసేలా స్మార్ట్ కార్డు విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో స్మార్ట్ కార్డులను జారీ చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు సమాచారం.

ప్రణాళిక బద్ధంగా పథకం అమలు
ఏపీలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణ పథకంలో భాగంగా ప్రయాణాలు చేసే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ప్రణాళిక బద్ధంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. స్త్రీ శక్తి పేరుతో ప్రారంభమైన ఈ స్కీం ఏపీలో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్ తో ప్రయాణ సౌకర్యాన్ని కలిగిస్తుంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో, ఎక్స్ప్రెస్ బస్సులలో ఇకపై మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+