శూన్యం నుంచి సృష్టి వరకు.. చరిత్ర నిన్ను క్షమించదు జగన్

"ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పార్లమెంటు చట్టబద్ధత కల్పించడం ఐదు కోట్ల ఆంధ్రుల ఆశలు, ఆశయాల విజయమని" ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అమరావతి ఇకపై భవిష్యత్తు తరాలకు ఒక గొప్ప ఆస్తిగా, దేశానికే గర్వకారణంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ రాజముద్రతో అమరావతికి తిరుగులేని రక్షణ లభించిందని, దీనిని భవిష్యత్తులో ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు.

పార్లమెంటులో 50కి పైగా రాజకీయ పార్టీలు అమరావతికి మద్దతు పలికితే, రాష్ట్రం నుంచి ఎన్నికైన వైసీపీ ఎంపీలు మాత్రం బిల్లును వ్యతిరేకించడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచి, పార్లమెంటులో రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడం నీచాతి నీచమని" ధ్వజమెత్తారు. రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ దేశవ్యాప్త పార్టీలు ఏపీకి అండగా నిలిచాయని, కానీ వైసీపీ మాత్రం రాష్ట్రం నాశనమైనా పర్వాలేదన్న పట్టుదలతో కుట్రలు చేసిందని విమర్శించారు. రాజధానిపై అడుగడుగునా విషం చిమ్మిన వారిని చరిత్ర క్షమించదని ఆయన హెచ్చరించారు.

CM Chandrababu Naidu Thanks PM Modi as Amaravati Gets Statutory Status A Future-Ready Global City in Making

శూన్యం నుంచి సృష్టి వరకు..

విభజన కష్టాలను గుర్తు చేసుకున్న చంద్రబాబు, రాజధాని లేని రాష్ట్రంగా మనం విజయవాడకు వచ్చి, ఒక బస్సులో బస చేసి పాలన ప్రారంభించిన రోజులను నెమరువేసుకున్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ప్రకారం అత్యధిక ప్రజలు కోరుకున్న విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతాన్నే రాజధానిగా ఎంపిక చేశామని తెలిపారు. సింగపూర్ సహకారంతో ప్రపంచ స్థాయి మాస్టర్ ప్లాన్ రూపొందించామని, 29 వేల మంది రైతులు తమ 34 వేల ఎకరాల సారవంతమైన భూములను స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చి చరిత్ర సృష్టించారని కొనియాడారు. వారి త్యాగం వృధా కాదని, అమరావతి అభివృద్ధి ద్వారా వారంతా లబ్ధి పొందుతారని హామీ ఇచ్చారు.

అమరావతి - నవనగరాల సమ్మేళనం

అమరావతిని కేవలం నాలుగు భవనాల సమూహంగా కాకుండా, 9 ప్రత్యేక నగరాలుగా (నైపుణ్యం, ఆర్థికం, ఆరోగ్యం మొదలైనవి) తీర్చిదిద్దుతున్నట్లు చంద్రబాబు వివరించారు. నార్మన్ ఫోస్టర్స్ వంటి ప్రపంచ శ్రేణి ఆర్కిటెక్ట్‌ల రూపకల్పనతో బ్లూ-గ్రీన్ సిటీగా, వాక్-టు-వర్క్ సంస్కృతితో అధునాతన నగరంగా మారుస్తామని చెప్పారు. గత ఐదేళ్ల కాలంలో వైసీపీ చేసిన విధ్వంసం వల్ల అమరావతి బ్రాండ్ దెబ్బతిన్నప్పటికీ, ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్, ఏడీబీ వంటి సంస్థల నుంచి రూ. 56 వేల కోట్ల ఆర్థిక తోడ్పాటుతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, 2028 నాటికి ప్రధాన నిర్మాణాలన్నీ ఒక కొలిక్కి వస్తాయని వెల్లడించారు.

రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక

హైదరాబాద్‌లో సైబరాబాద్ సృష్టించిన సంపదను ఉదాహరణగా చూపుతూ, అమరావతి కూడా ఏపీకి ఆదాయ వనరుగా మారుతుందని ముఖ్యమంత్రి వివరించారు. అమరావతితో పాటు విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలను కూడా పారిశ్రామిక హబ్‌లుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. చివరగా, ఈ చారిత్రాత్మక చట్టానికి సహకరించిన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు ఐదు కోట్ల ఆంధ్రుల తరపున చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు.

తెలంగాణకు నేను వ్యతిరేకం కాదు..

తెలంగాణకు నేను వ్యతిరేకం కాదు.. తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్.. విభజన జరిగినప్పుడు రెండు రాష్ట్రాల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి.. తెలుగుజాతి కోసం సైబరాబాద్, హైటెక్ సిటీ నిర్మించాం.. రెండు రాష్ట్రాల ప్రజలకు న్యాయం చేసి విభజన చేయాలని కోరాం.. రాజధాని లేకుండా ఏపీని విభజించారు.. పరిపాలన చేయడానికి ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి.. నా అనుభవంతో తెలంగాణలోని ఏడు మండలాలను విలీనం చేయించా.. పోలవరం ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయించాను.. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపితేనే ప్రమాణం చేస్తానని చెప్పాను: సీఎం చంద్రబాబు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+