ముందస్తు ఎన్నికలు: చంద్రబాబుకు అంత ధైర్యం లేదు, ఓడిపోయేది టీడీపీయే: పద్మశ్రీ
ముందస్తు ఎన్నికలకు వెళ్లేంత ధైర్యం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేదని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి ఖాయమన్న సంగతి అందరికీ తెలిసిందే అని ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ వ్యాఖ్య
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించలేని చంద్రబాబు నాయుడు.. నీతి ఆయోగ్ సమావేశంలో నిధుల కోసం ప్రాధేయపడటాన్ని దిక్కుమాలిన చర్యగా అభివర్ణించారు ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ.
సోమవారం విజయవాడలోని పీసీసీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. గడిచిన మూడేళ్లలో నాలుగు లక్షల మందికిపైగా కూలీలు వలస వెళ్లినా చంద్రబాబు సర్కారు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.

'ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఈ మధ్య చంద్రబాబు అన్నట్లు వార్తలు వచ్చాయి. తప్పుడు మాటలతో పరిపాలన సాగిస్తోన్న ఆయనకు ముందస్తు ఎన్నికలకు వెళ్లేంత ధైర్యం లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి ఖాయమన్న సంగతి అందరికీ తెలిసిందే' అని పద్మశ్రీ అన్నారు.
టీడీపీ సర్కారు ప్రాథమిక వైద్య కేంద్రాలను ప్రైవేట్ పరం చేయడాన్ని కూడా ఆమె తప్పుపట్టారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ధనేకుల మురళీ, మీసాల రాజేశ్వరరావు, నరహరశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications