CM Chandrababu: పోలవరం ప్రాజెక్ట్ సందర్శన.. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలి పర్యటన
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు చేసిన తొలి పర్యటన పోలవరం ప్రాజెక్టును సందర్శించడం. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు అసలు ముందుకు సాగలేదు. ఈ క్రమంలో పోలువరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించాలని భావించిన చంద్రబాబు ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించాలని నిర్ణయించారు.
పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించిన చంద్రబాబు
ఈ క్రమంలోనే చంద్రబాబు నేడు ప్రత్యేక హెలికాప్టర్లో పోలవరం ప్రాజెక్టు వద్ద ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టును నేరుగా సందర్శించి అక్కడ చేపట్టాల్సిన పనులను, జరుగుతున్న పనులను పరిశీలించారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికాయి. పోలవరం హిల్ వే వద్ద ప్రజాప్రతినిధులందరిని చంద్రబాబు పలకరించారు.

పనుల పురోగతిపై ఆరా
అనంతరం పోలవరం ప్రాజెక్టు హిల్ వే నుంచి స్పిల్ వే ను చంద్రబాబు పరిశీలించారు. ప్రాజెక్టు వద్ద అధికారులతో మాట్లాడారు. స్పిల్ వే, కాపర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారితో కలిసి బస్సులో ప్రాజెక్టు పరిసరాలను, పరిశీలించారు చంద్రబాబు.
సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలి పర్యటన
సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఐదవ రోజు పోలవరం ప్రాజెక్ట్ సందర్శించిన చంద్రబాబు ప్రాజెక్టు ప్రాంతాన్ని వ్యూ పాయింట్ నుంచి చూడడంతో పాటు 22, 23 గేట్ల దగ్గర ప్రాజెక్టును పరిశీలించారు. పోలవరం పనులు జరుగుతున్న తీరును అధికారులు చంద్రబాబుకు వివరించారు. ఎడమ గట్టు దగ్గర కుంగిన గైడ్ బండి ప్రాంతాన్ని కూడా పరిశీలించిన చంద్రబాబు పోలవరం కుడికాలు ఎక్కడ వరకు పొడిగించవచ్చు అన్నది అధికారులను ఆరా తీశారు.
Chandrababu Naidu at Polavaram.#CBN #Polavaram pic.twitter.com/m8hYZxLClG
— Vijay Krishna (@VijayKris007) June 17, 2024
పోలవరం ప్రాజెక్ట్ పై చంద్రబాబు సమీక్ష
అంతేకాదు నీటిని గరిష్టంగా ఉపయోగించుకునే అవకాశాలను కూడా పరిశీలించాలని వైకుంఠపురం వరకు కుడికాలువను పొడిగించడానికి సాధ్యసాద్యాలను పరిశీలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు కాంట్రాక్ట్ ఏజెన్సీ లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏపీ జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు గత ప్రభుత్వ అసమర్ధత వల్ల ప్రశ్నార్ధకంగా మారింది. పోలవరం ప్రాజెక్టు పని ఎలా ఉందంటే మొదలుపెట్టిన చోటికి మళ్ళీ వచ్చామన్నట్టుగా ఉంది .
పోలవరం పనుల వేగాన్ని పెంచాలన్న చంద్రబాబు
పోలవరం ప్రాజెక్ట్ లో మళ్ళీ ఎన్నింటిని కొత్తగా నిర్మించాలి ఎన్నింటికి మరమ్మతు చేయాలి అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు చంద్రబాబు. ఇక ఇప్పుడు ప్రాజెక్ట్ అంచనాలు కూడా భారీగా పెరిగిపోయే అవకాశం ఉందంటున్నారు. 2014లో టిడిపి ప్రభుత్వ హయంలో జరిగిన పనులు మినహాయించి గత ఐదేళ్లలో పెద్దగా పనుల పురోగతి లేదని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి కావలసిన చర్యలను తక్షణమే మొదలుపెట్టినట్టుగా చంద్రబాబు వెల్లడించారు.












Click it and Unblock the Notifications