ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. నంద్యాల జిల్లాలో నేడు క్యూఆర్ కోడ్ తో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రైతుల భూముల పైన పూర్తి హక్కులను కల్పించడంతోపాటు, అవినీతి రహితంగా ఉండేవిధంగా పట్టాల పంపిణీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.
ఏపీలో భూ రికార్డుల నిర్వహణలో సమూల సంస్కరణలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఎటువంటి రెవిన్యూ సమస్యలు లేకుండా పకడ్బందీగా పట్టాదారు పాసు పుస్తకాలను అందిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ రికార్డుల నిర్వహణలో సమూల సంస్కరణలు చేపడుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా కొత్త బురుజు గ్రామంలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్న చంద్రబాబు రైతులకు స్వయంగా నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఇచ్చారు.

ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నాం
అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, గత ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసినట్టు గుర్తు చేశారు. రైతులకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామని, ఆ హామీ మేరకు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు అన్నారు.
ఫోర్జరీలకు అవకాశం లేకుండా భూ రికార్డులు
భూ రికార్డులను తారుమారు చేసే అవకాశం లేకుండా పక్కాగా, పారదర్శకంగా పట్టాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో పట్టాదారు పాసు పుస్తకాల విషయంలో నెలకొన్న గందరగోళానికి స్వస్తి చెబుతూ కొత్త క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. అధునాతన సాంకేతికత వల్ల రికార్డులు భద్రంగా ఉంటాయని, ఫోర్జరీ లకు ఎటువంటి అవకాశం ఉండదని చంద్రబాబు వెల్లడించారు.
అవినీతి లేకుండా పట్టాలు అందిస్తాం
ఒక్క పైసా కూడా అవినీతికి తావు లేకుండా పట్టాలు అందజేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో ఉన్న భూ వివాదాలు, రెవిన్యూ సమస్యలు అన్నింటిని పరిష్కరించిన తర్వాతనే కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో రికార్డుల నిర్వహణలో లోపాలు
గత ప్రభుత్వ హయాంలో రికార్డుల నిర్వహణలో జరిగిన లోపాల వల్ల రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని చంద్రబాబు విమర్శించారు. ఇకపైన భవిష్యత్తులో అటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులకు తమ భూమిపై పూర్తి హక్కులు ఉండేలా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications