సంపన్న నేరస్థుడు పాబ్లో ఎస్కోబార్ లా జగన్: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాంతిభద్రతలపై ఏపీ సీఎం చంద్రబాబు నేడు శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో దయనీయంగా శాంతిభద్రతలు మారాయని పేర్కొన్న చంద్రబాబు మొత్తం ఐదు అంశాలుగా శ్వేత పత్రాన్ని విభజించామని వెల్లడించారు. టిడిపి హయాంలోనే నేరాల కట్టడి చేశామని, 2014- 2019 మధ్య శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకున్నామని, ఫ్యాక్షన్ గ్రామాల పైన శ్రద్ధ పెట్టామని చంద్రబాబు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాంతిభద్రతలపై ఏపీ సీఎం చంద్రబాబు నేడు శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో దయనీయంగా శాంతిభద్రతలు మారాయని పేర్కొన్న చంద్రబాబు మొత్తం ఐదు అంశాలుగా శ్వేత పత్రాన్ని విభజించామని వెల్లడించారు. టిడిపి హయాంలోనే నేరాల కట్టడి చేశామని, 2014- 2019 మధ్య శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకున్నామని, ఫ్యాక్షన్ గ్రామాల పైన శ్రద్ధ పెట్టామని చంద్రబాబు తెలిపారు.

CM Chandrababu sensational comments on ys jagan comparing with pablo escobar in law and order white paper

జగన్ పాలనలో శాంతి భద్రతలు ఇలా
2019 - 2024 మధ్యకాలంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ లేకుండా పోయిందని, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే ఏమిటో గత ప్రభుత్వం చూపించిందన్నారు. గతంలో ప్రభుత్వమే హింసను ప్రేరేపించింది అని చంద్రబాబు ఆరోపించారు. వైసిపి కక్షపూరిత చర్యలకు పోలీసులను ఆయుధంగా మారారని చంద్రబాబు పేర్కొన్నారు.

జగన్ పాలనలో చంద్రబాబుపై 17 కేసులు, పవన్ కళ్యాణ్ మీద 7 కేసులు
తన పైన చిన్నప్పటి నుంచి ఒక్క కేసు కూడా లేదని కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తనపై 17 కేసులు, పవన్ కళ్యాణ్ మీద 7 కేసులు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకుని నిరసన తెలియజేసే పరిస్థితి తీసుకు వచ్చారన్నారు. స తప్పుడు కేసులు పెట్టి కోడెలను అవమానించారని ఆ అవమానంతోనే కోడెల ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.

జైల్లో కొడుతుంటే చూసి ఎంజాయ్ చేసిన జగన్
ప్రస్తుత హోం మంత్రి అనిత మీద కొందరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని చంద్రబాబు విమర్శించారు. రఘురామకృష్ణంరాజును జైల్లో పెట్టి కొడుతుంటే ఆనాటి సీఎం దానిని ఫోన్ లో చూసి ఎంజాయ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అమరావతి పర్యటనకు వెళ్తుంటే అడ్డుకున్నారని, అడ్డుకోవడం భావ ప్రకటన స్వేచ్ఛ అని నాటి డిజిపి కామెంట్ చేశారని చంద్రబాబు గుర్తు చేశారు.

చరిత్రలో ఇలాంటి నాయకుడిని ఎప్పుడైనా చూసారా?
.అమరావతికి ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చినందుకు 2525మందిని అరెస్టు చేశారని, న్యాయస్థానం నుంచి దేవస్ధానం కార్యక్రమంలో రోడ్డుపై భోజనం చేసేలా చేశారన్నారు. కోడి కత్తి డ్రామాలు, వైఎస్ వివేకా హత్యకేసులో చేసిన దారుణాలు ఒకటా.. రెండా అంటూ ఏకరువు పెట్టారు. చరిత్రలో ఇలాంటి నాయకుడిని ఎప్పుడైనా చూసారా? అని ప్రశ్నించిన చంద్రబాబున తన నలభై అయిదు ఏళ్ళ రాజకీయాల్లో ఎవ్వరిని చూడలేదన్నారు.

ఎస్కోబార్ కొలంబియన్ లా జగన్ కూడా
ఎస్కోబార్ కొలంబియన్ డ్రగ్ కింగ్ పిన్ తో జగన్ ను పోల్చారు. పాబ్లో ఎస్కోబార్ కొలంబియన్ రాజకీయ నాయకుడు అయ్యి డ్రగ్ కారిడార్‌లు ఏర్పాటు చేశాడని, 30 బిలియన్ డాలర్లు సంపాదించి 1977లో అరెస్టు అయ్యాడని పేర్కొన్న చంద్రబాబు 1982లో కొలంబియా పార్లమెంట్ ఎంపీ అయ్యాడని, అమెరికా అరెస్టు చేయాలనుకుంటే ప్రిజన్ అతనే కట్టుకొని అక్కడే ఉంటానన్నాడని చెప్పారు.

జగన్ లక్ష్యం ఇదే... ఆయన చాలా డేంజర్
తరువాత 1986లో కొలంబియా న్యాయమంత్రిని చంపాడని, తరువాత 1987లో సుప్రీంకోర్టు పై దాడి చేసి 11 మంది జడ్జిలతో పాటు ఎంతో మందిని చంపాడని వెల్లడించారు. అలా జగన్ కూడా హానికరమైన వ్యక్తి అన్నారు. ఇలాంటివారు రాజకీయాలలో ఉండటం డేంజర్ అన్నారు. మాజీ సీఎం జగన్ టాటా, రిలయన్స్, అదాని కంటే ఎక్కవ డబ్బు సంపాదించాలనుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో ప్రస్తుత ప్రభుత్వ శాంతి భద్రతల పరిరక్షణపై చంద్రబాబు
ప్రజల శాంతిభద్రతలకు పెద్దపీట వేసి ప్రస్తుత ప్రభుత్వ పాలన సాగుతుందని అయితే, అసత్య ప్రచారాలతో, కుట్రలతో ఏపీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. శాంతి భద్రతల పరిరక్షణకు టిడిపి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణ కోసం ఎటువంటి కఠిన నిర్ణయాలైన తీసుకోవడానికి వెనుకడుగు వేసేది లేదని చంద్రబాబు ఈ మేరకు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+