జగన్ కు చంద్రబాబు గట్టి షాక్.. ఆ ఫైల్స్ సీజ్; రంగంలోకి సిఐడీ!!
ఏపీలో పాలనాపగ్గాలు చెప్పటిన చంద్రబాబు ప్రభుత్వం శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ గత ప్రభుత్వ అవినీతిని, వైఫల్యాలను ఎండగడుతుంది. ఇదే సమయంలో ఆయా శాఖల వారీగా ప్రక్షాళన మొదలుపెడుతుంది. ఇక తాజాగా ఎక్సైజ్ శాఖపై సమీక్ష జరిపిన చంద్రబాబు గత ఐదేళ్ళు పాలన జరిపిన జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు. జగన్ పాలన సమయంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతిపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఎక్సైజ్ అక్రమాలపై సీఐడీతో దర్యాప్తు
ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సీఐడీతో దర్యాప్తు జరిపిస్తామని సీఎం చంద్రబాబు నాయడు మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే ఏపీలో మద్యం అక్రమాలపై విచారణ జరిపిస్తామని శ్వేత పత్రం విడుదల చేసిన సమయంలో అసెంబ్లీ వేదికగా ప్రకటించిన చంద్రబాబు దీనిపై నిర్ణయం తీసుకున్నకారణంగా గత 5 ఏళ్లలో జరిగిన లావాదేవీలపై అన్ని ఫైళ్లు సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు.

జగన్ పాలనలో మద్యం విధానంతో భారీ అక్రమాలు
త్వరలో ప్రారంభమయ్యే సీఐడీ విచారణకు ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తిగా సహకరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జగన్ పాలనలో ఊహించని స్థాయిలో 5 ఏళ్లలో మద్యంలో అక్రమాలు జరిగాయని దీనిపై అన్ని లావాదేవీలు సీఐడీకి అందించాలన్నారు చంద్రబాబు. గత ప్రభుత్వం మద్య నిషేధం చేస్తామని చెప్పి, చెయ్యకుండా నాసిరకం మద్యం తెచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిందని మండిపడ్డారు.
నాణ్యత లేని మద్యం ఏపీలో ఉండకూడదు
ప్రజల ప్రాణాలు తీసే నాసిరకం మద్యం ఇక రాష్ట్రంలో కనిపించటానికి వీలు లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల్లో చెప్పినట్లు నాణ్యత లేని మద్యం ఏపీలో లేకుండా చేయాల్సిన అవసరం ఉందన్న సీఎం చంద్రబాబు నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అన్నారు. మద్యం సేవించేవారితో మాన్పించడం సాధ్యం కాకపోయినప్పటికీ తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే నాణ్యత లేని నాసిరకం మద్యం లేకుండా చేస్తే మంచిదన్నారు.
గతంలో మద్యం విధానం వల్ల పేదల జీవితాలు నాశనం అయ్యాయి
గత ప్రభుత్వం అడ్డగోలుగా రేట్లు పెంచి పేదలను దోచుకుందని పేర్కొన్న సీఎం చంద్రబాబు నాటి మద్యం ధరలు భరించలేక చాలా మంది గంజాయి, కల్తీ మద్యం, నాటుసారా తాగి ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నారన్నారు. జగన్ హయాంలో ఇష్టారీతిన పెంచిన ధరలు పేదల జీవితాలను మరింత నాశనం చేశాయని పేర్కొన్న చంద్రబాబు ఆ ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు.
పేదవాడిని దోచుకున్న విధానానికి స్వస్తి
పేద కుటుంబాల జీవన ప్రమాణాలు దెబ్బ తినకుండా మద్యం విధానం ఉండాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రేట్లు పెంచి పేదవాడిని దోచుకున్న విధానానికి స్వస్తి పలకాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల మద్యం మన రాష్ట్రంలోకి రాకుండా చూడాలని ఆదేశించారు. గంజాయి విషయంలో కూడా ఉక్కుపాదం మోపాలన్నారు సీఎం చంద్రబాబు . మద్యం విధానం ఆదాయం కోణంలో చూడొద్దని, అవకతవకలకు అవకాశం లేని విధంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications