జనసేన నెంబర్ టూతో సీఎం సమావేశం, ఏం చేశారు?, ఏం చేస్తున్నారు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పారు అమ్మవారి ఆశీస్సులు, తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రపంచంలోని తెలుగు వాళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని తాను కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలుగు ప్రజలకు అందరికి మరోసారి దసరా శుభాకాంక్షలు అని సీఎం చంద్రబాబు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు శనివారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో ఈ సమావేశం జరిగింది. జనసేన పార్టీలో నెంబర్ టూ అయిన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు ఆ శాఖలకు సంబందించిన సీనియర్ అధికారులు సీఎం చంద్రబాబు ముందు ప్రత్యక్షం అయ్యారు.

CM Chandrababu talks about price control of essential commodities

నిత్యవసర వస్తువుల నియంత్రణకు మన ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకుంది, మీరు ఏం చేశారు, ధరలను నియంత్రించడానికి మీరు తీసుకున్న చర్యలు ఏమిటి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు సంబంధిత శాఖల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో ప్రతిపక్ష పార్టీ నాయకులు మన పైన విమర్శలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారని తెలిసింది.

వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలని, ఆ దిశగా మీరు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నాదెండ్ల మనోహర్ కు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పడిన ధరల భారం తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలు, రానున్న రోజులలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాకుండా తీసుకుంటున్న విషయాల గురించి సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రి నాదేండ్ల మనోహర్, అధికారులు వివరించారు.

CM Chandrababu talks about price control of essential commodities

రైతు బజార్లలో చేపట్టిన అమ్మకాలు, వాటి కౌంటర్లు, ప్రజల స్పందన గురించి సీఎం చంద్రబాబు నాయుడు ఇదే సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిత్యవసర వస్తువులు ధరలు తగ్గించడానికి దిగుమతి చేసుకోవాల్సిన వస్తువుల గురించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారని తెలిసింది. మొత్తం మీద జనసేన పార్టీలో నెంబర్ టూగా ఉంటున్న మంత్రి నాదేంద్ర మనోహర్ తో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యి వివిద అంశాలపై చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+