చంద్రబాబు కొత్త థీమ్ ఆవిష్కరణ..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి పెట్టుబడుల ఆకర్షణ పైన ఫోకస్ చేసారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టబడులు - ఉపాధి కల్పన పైన కసరత్తు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా పలువురితో చంద్రబాబు టీం సంప్రదింపులు కొనసాగిస్తోంది. ఇక, ప్రతీ ఏటా స్విట్జర్లాండ్ దావోస్ లో జరిగి ప్రపంచ ఆర్దిక సదస్సుకు చంద్రబాబు హాజరు కానున్నారు. అక్కడ సరి కొత్త థీమ్ ఆవిష్కరణకు చంద్రబాబు సిద్దమయ్యారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం ఈ నెల 20వ తేదీ నుంచి 4 రోజుల పాటు దావోస్ లో పర్య టించనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 సదస్సుకు సీఎం నేతృత్వంలోని బృందం హాజరు కానుంది. 2014-19 కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ దావోస్ లో ఈ సదస్సులకు హాజరయ్యారు. జగన్ సీఎం అయిన తరువాత ఒక ఏడాది మాత్రమే వెళ్లారు. ఇక, ఇప్పుడు చంద్రబాబు కేబినెట్ లోని మంత్రులతో పాటుగా అధికారులతో కలిసిన టీం దావోస్ వెళ్లేందుకు సిద్దమైంది. జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరగనుంది.

ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ , పరిశ్రమలు, ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అధికారులు కూడా దావోస్ సదస్సుకు హాజరు కానున్నారు. రాష్ట్రంలోని వనరులు, పెట్టుబడి అవకాశాలను ప్రపంచ ఆర్ధిక సదస్సులో వివరించనున్నారు. 'షేపింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్' అనే థీమ్ తో ఈ సారి దావోస్ లో ప్రదర్శన ఏర్పాటు చేయనుంది. వరల్డ్ ఎకనామిక్ సదస్సులో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే స్టాల్‌తో పాటు రాష్ట్రానికి ప్రత్యేకంగా ఓ స్టాల్‌ను కేంద్రం రిజర్వు చేసింది.
రాష్ట్రంలో సాంకేతిక పాలన, పునరుత్పా దక విద్యుత్ ఉత్పత్తి, స్మార్ట్ సిటీస్, మౌలిక సదుపాయా ల కల్పన ప్రాజెక్టులతో పాటుగా రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ఈ సదస్సులో వివరించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక దగ్గజాలు దావోస్ కు రానున్నారు. వారితో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అయ్యేలా సమయం కోరారు. ఇదే సదస్సు ద్వారాలో ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు.. మౌళిక వసతులు.. పారిశ్రామిక పాలసీ గురించి వివరించి పెట్టు బడులను ఆకర్షించే ప్రయత్నం చేయనున్నారు.












Click it and Unblock the Notifications