అప్పుడు చంద్రబాబే మొదట స్పందించారు: నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్నూలు: తాను భార‌త యాత్ర‌కు సంకల్పించిన‌ప్పుడు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశాన‌ని, అప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడే మొదట స్పందించారని నోబెల్ శాంతి పుర‌స్కార‌ గ్రహీత కైలాశ్ స‌త్యార్థి అన్నారు.

క‌ర్నూలు జిల్లాలోని ఏపీఎస్పీ బెటాలియ‌న్ మైదానంలో మంగళవారం బాల‌ల భ‌ద్ర‌తే భార‌త భ‌ద్ర‌త పేరుతో బ‌హిరంగ స‌భ జ‌రిగింది. ఇందులో సీఎం చంద్ర‌బాబు, నోబెల్ శాంతి పురస్కార గ్ర‌హీత కైలాశ్ స‌త్యార్థి పాల్గొన్నారు.

అవసరమైతే ఎల్ అండ్ టిని తప్పించండి: సచివాలయంపై ఏపీ ఆగ్రహం

విద్యార్థుల‌తో మాట్లాడించి వారి అభిప్రాయాల‌ను తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా సత్యార్థి మాట్లాడారు. ఏపీలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఎంతో మంది ముందుకు వ‌స్తున్నారని చెప్పారు. పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్ట‌డంతో పాటు బాల‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు కృషి చేయాల‌ని కోరుతున్నాన‌ని చెప్పారు.

పిల్ల‌లు సంతోషంగా ఉండ‌డానికి అంద‌రం క‌లిసి కృషి చేద్దామ‌న్నారు. భార‌తదేశాన్ని బాల‌ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించే దేశంగా తీర్చిదిద్దాలన్నారు. భారత్ యాత్రలో భాగంగా ఆయన 22 రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
During their country wide tour, Kailash Satyarthi Children’s Foundation (KSCF) pass through Ananthapur and Kurnool on September 19 and 20.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి