చంద్రబాబు వస్తున్నారు..జగన్ వెళ్తున్నారు: ఇద్దరు నేతల విదేశీ టూర్లు: ఆధ్యాత్మికం..ఆరోగ్యం..!
ముఖ్యమంత్రి జగన్..ప్రతిపక్ష నేత చంద్రబాబు విదేశీ పర్యటనలు ఖరారయ్యాయి. చంద్రబాబు ఆరోగ్య పరీక్షల కోసం నాలుగు రోజుల పరీక్ష కోసం అమెరికా వెళ్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆధ్మాత్మిక టూర్‌లో భాగంగా కుటుంబ సభ్యుల తో కలిసి జెరూసెలం వెళ్లనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఇద్దరిదీ అధికారిక షెడ్యూల్ ఖరారైంది. అయితే చంద్రబాబు ఈనెల 27న వెళ్లి..ఆగస్టు1న తిరిగి రానున్నారు. ముఖ్యమంత్రి జగన్ అదే రోజు జెరూసెలం వెళ్లి తిరిగి ఆగ స్టు 4న తిరిగి వస్తారు. తిరిగి ఆగస్టు 16న ముఖ్యమంత్రి మరోసారి కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లనున్నారు.
ఆరోగ్య పరీక్షల కోసం అమెరికాకు చంద్రబాబు..
ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆదివారం అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఆరోగ్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్తు న్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. గత ఏడాది సైతం అమెరికా వెళ్లిన సమయంలో ఆయన ఆరోగ్య పరీక్షలు చేయిం చుకున్నారు. ఏడాది అవటంతో మరో సారి రెగ్యులర్ చెకప్‌లో భాగంగా ఆయన అమెరికా వెళ్లనున్నారు. అసెంబ్లీ సమా వేశాలు మరో రెండు రోజుల పాటు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల తరువాత వెళ్లాలని తొలుత భావించినా.. తిరిగి ఆదివారమే షెడ్యూల్ ఖరారైంది. ఆయన అక్కడ వైద్య పరీక్షలు ముగిసిన తరువాత తిరిగి ఆగస్టు 1న ఏపికి రాను న్నారు. చివరి రెండు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ద్రవ్య వినిమయ బిల్లు పైన చర్చించాల్సి ఉండటంతో ఆ బాధ్యత లను కేశవ్‌కు అప్పగించారు. దీనికి సంబంధించి పర్యవేక్షణ బాధ్యత యనమలకు కేటాయించారు. చంద్రబాబు అమెరికా టూర్ పూర్తిగా వ్యక్తిగత పర్యటనగా చెబుతున్నారు.

ఏపీకి చంద్రబాబు..జెరూసెలంకు జగన్
అమెరికా పర్యటన ముగించుకొని తిరిగి వచ్చే రోజే ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ఇజ్రాయెల్ దేశంలో జెరూసెలం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అధికారికంగా షెడ్యూల్ ఖరారైంది. పూర్తిగా వ్యక్తిగత పర్య టన గా ఈ టూర్ చెబుతున్నారు. వైయస్ ఉన్న సమయంలో కుటుంబం మొత్తం ప్రతీ ఏడాది వేసవిలో జెరూసెలం వెళ్లటం ఆనవాయితీ. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్ తొలి సారిగా జెరూసెలం పర్యటనకు ఆగస్టు1న వెళ్లి..నాల్గవ తేదీ తిరిగి రానున్నారు. సీఎం జగన్ వెంట భద్రతా అధికారులు ఎస్ఎస్‌జీ ఎస్పీ సెంథిల్ కుమార్, సీఎం వ్యక్తిగత భద్రతా అధికారి జోషి తదితరులు వెళ్లనున్నారు. ఆ తరువాత ఆగస్టు 16 నుండి 23 వరకు ముఖ్యమంత్రి జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్తారు. అక్కడ ప్రవాసాంధ్రులు..వైసీపీ ఎన్నారై విభాగాలు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 17వ తేదీన డల్లాస్‌లో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. ఇది కూడా వ్యక్తి గత పర్యటనే అయినా..ఈ కార్యక్రమాల వరకు జగన్ అంగీకరించారు.












Click it and Unblock the Notifications