Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రఘురామ రాజు పై పోటీగా ఉమాబాల, జగన్ నిర్ణయం వెనుక - గెలుపెవరిది..!!

సీఎం జగన్ అభ్యర్దుల ఎంపికలో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. నర్సాపురం ఎంపీ అభ్యర్దిగా బీసీ వర్గానికి చెందిన మహిళను ఖరారు చేసారు. నర్సాపురంలో ఇప్పటి వరకు మహిళ ఎంపీగా పోటీ చేయలేదు. టీడీపీ, జనసేన కూటమి అభ్యర్దిగా రఘురామ రాజు పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. నర్సాపురం నుంచి బరిలో నిలుస్తున్న ఉమాబాల మూడు దశాబ్దాలుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. జగన్ ఈ ఎంపిక వెనుక కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.

బీసీ మహిళకు ఛాన్స్
ముఖ్యమంత్రి జగన్ ఈ సారి సామాజిక సమీకరణాలు - గెలుపే లక్ష్యంగా అభ్యర్దుల ఎంపిక కొనసాగిస్తున్నారు. గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన పొత్తు వేళ బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గోదావరి జిల్లాల్లో అయిదు పార్లమెంట్ స్థానాల్లో రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు ఎంపీలుగా బీసీ వర్గాలకు కేటాయించారు. తూర్పు గోదావరి లో బీసీ-కాపు సామాజిక వర్గాలకు మెజార్టీ సీట్లు ఖరారు చేసారు. అందునా శెట్టి బలిజ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజమండ్రి, నర్సాపురం రెండు పార్లమెంట్ స్థానాలు ఇదే వర్గానికి ప్రకటించారు. ఎమ్మెల్యే స్థానాల్లోనూ ఇదే రకంగా ప్రాధాన్యత ఇచ్చారు. గోదావరి జిల్లాల్లో శెట్టి బలిజ ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నారు.

CM Jagan Announced Guduru Ushabala for Narsapuram loksabha against Ragurama Raju in next Elections

కొత్త సమీకరణాలు
పవన్ పొత్తుతో టీడీపీ కాపు ఓటింగ్ తమకు కలిసి వస్తుందనే అంచనాలతో ఉన్న సమయంలో సీఎం జగన్ బీసీలు...శెట్టి బలిజలకు ప్రాధాన్యతతో కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. నర్సాపురంలో ఇప్పటి వరకు మహిళ పోటీ చేయలేదు. ప్రస్తుతం ప్రకటించిన ఉమాబాల న్యాయవాది.1995 నుంచి భీమవరం మున్సిపల్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. కౌన్సిలర్ గా ఉంటూ మున్సిపల్ ఛైర్మన్ గా పోటీ చేసారు. జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, డీసీసీ ప్రధాన కార్యదర్శిగా, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ గా, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా, ద్వారకా తిరుమల దేవస్థానం పాలకమండలి సభ్యులుగా పనిచేసి ప్రస్తుతం వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్నారు.

కలిసొచ్చేదెవరికి
నర్సాపురం పార్లమెంట్ స్థానంలో కాపు, క్షత్రియ, శెట్టి బలిజ, మత్య్సకార వర్గాలకు పెద్ద సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన రఘురామ ఆ తరువా పార్టీతో విభేదించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి అభ్యర్దిగా దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు.గత ఎన్నికల్లో మెగా బ్రదర్ నాగబాబు ఇక్కడ నుంచి జనసేన అభ్యర్దిగా పోటీ చేస్తే ఆయనకు 250,289 ఓట్లు వచ్చాయి. ఇక్కడలో 2004లో హరిరామజోగయ్య కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలవగా, ఆ తరువాత 2009లో బాపిరాజు, 2014లో గోకరాజు గంగరాజు, 2019లో రఘురామ రాజు గెలుపొందారు. ఈ సారి జగన్ అనూహ్యంగా బీసీ వర్గానికి చెందిన మహిళను ఇక్కడ నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించారు. దీంతో, ఈ నియోజకవర్గంలో ఎన్నికల సమీకరణాలు..ఫలితం పైనా రాజకీయంగా ఆసక్తి పెరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+