
ఎన్నికల ముందు సీఎం జగన్ మరో కీలక నిర్ణయం..!!
వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 అంటూ టార్గెట్ ఫిక్స్ చేసిన జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల సంవత్సరం కావటంతో ప్రజలకు మరింత చేరువ అయ్యే నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ తన నవరత్నాల్లో భాగమైన పేదలకు ఇళ్లు పంపిణీ కార్యక్రమం క్యాలెండర్ ఫిక్స్ చేసారు. డిసెంబర్ నాటికల్లా 1,10,672 ఇళ్లకు లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది మార్చినాటికల్లా మరో 1,10,968 ఇళ్లను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు అధికారులతో నిర్వహించిన సమీక్షలో డిసైడ్ అయ్యారు.
ఫేజ్ 1కు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని అధికారులు సీఎంకు తెలిపారు. వేయి ఇళ్లు ఉన్నచోట్ల రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. వర్షాలు తగ్గినందున వేగంగా పనులు ముందుకు సాగుతాయని అధికారులు చెప్పుకొచ్చారు. ఈ ఒక్క 2022-23 ఆర్థిక సంవత్సరంలో గృహనిర్మాణం కోసం రూ.5,005 కోట్లు ఖర్చు చేశామన్నారు.
విశాఖలో మంజూరుచేసిన ఇళ్ల నిర్మాణాలపైనా ప్రత్యేక దృష్టిపెడుతున్నామని అధికారులు సీఎం కు నివేదిక ఇచ్చారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలు, విద్యుద్దీకరణ పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. టిడ్కో ఇళ్లలో ఇప్పటికే 40,576 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించినట్లు వెల్లడించారు.

డిసెంబర్ కల్లా 1,10,672 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగిస్తామని స్పష్టం చేసారు. ఫేజ్-1కు సంబంధించి దాదాపుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసిందని చెప్పారు. ముఖ్యమంత్రి గతంలో చేసిన సూచనలకు అనుగుణంగా టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వివరించారు. వేయి ఇళ్లకు పైగా ఉన్న చోట్ల రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇళ్ల నిర్వహణపై వారికి అవగాహన, మార్గదర్శకాలు సూచిస్తున్నామని చెప్పారు. పరిశుభ్రంగా నిర్వహించడం, శానిటేషన్, విద్యుత్ దీపాల నిర్వహణ, వీధి లైట్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్వహణ తదితర అంశాలపై అసోసియేషన్లకు అవగాహన కల్పిస్తున్నామన్న అధికారులు ఆ దిశగా ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు వెల్లడించారు.