వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ నూతన సీఎస్‌గా సమీర్ శర్మ : సీఎం జగన్ వ్యూహాత్మక ఎంపిక : కేంద్రం నుంచి ఏపీకి..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ నియమితులయ్యారు. ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ నియమితులయ్యారు. ఈనెల 30వ తేదీతో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పటికే మూడు నెలల ఎక్స్ టెన్షన్‌లో ఆదిత్యనాథ్ దాస్ ఉన్నారు. సమీర్ శర్మ 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ప్రణాళిక విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా డాక్టర్ సమీర్ శర్మ ఉన్నారు. ఈనెల 30వ తేదీతో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీ విరమణ చేయనున్నారు.

 20 రోజులు ముందుగానే సీఎస్ ఎంపిక

20 రోజులు ముందుగానే సీఎస్ ఎంపిక

కొద్ది రోజులుగా కాబోయే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో వినిపించింది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న అజయ్ సహానీ ఇప్పుడున్న అధికారుల్లో సీనియర్ గా ఉన్నారు. ఆయన కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్నారు. ఆయన సతీమణి నీలం సాహ్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పదవీ విరమణ చేసి ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే, ఆయనకు సీఎస్ గా అవకాశం ఇస్తే ఏపీకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారనే వార్తలు వినిపించాయి. 2014లో రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు వద్ద అజయ్ సహానీ ముఖ్య కార్యదర్శిగా పని చేసారు. ఆ తరువాత తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు.

 జగన్ వ్యూహాత్మకంగా సమీర్ వైపు

జగన్ వ్యూహాత్మకంగా సమీర్ వైపు

అయితే, అనూహ్యంగా 1985 బ్యాచ్ కు చెందిన శమీర్ శర్మ..రెడ్డి సుబ్రమణ్యం పేర్ల గురించి చర్చకు వచ్చింది. కానీ, నూతన సీఎస్ ఎంపిక విషయంలో సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కొద్ది నెలల క్రితమే కేంద్ర సర్వీసుల్లో ఉన్న సమీర్ శర్మను ఏపీకి పిలించారు. ఏపీలో కీలకమైన ప్లానింగ్ విభాగాన్ని అప్పగించారు. ఇప్పుడు ఇంకా ఇరవై రోజులు దాస్ సీఎస్ పదవిలో కొనసాగనున్నారు. సాధారణంగా సీఎస్ పదవి కోసం ఉండే పోటీ కారణంగా ముందు రోజు...లేదా ప్రస్తుత సీఎస్ పదవీ విరమణ రోజు నూతన సీఎస్ ను ఎంపిక చేయటం పరిపాటిగా వస్తోంది.

సుదీర్ఘ అనుభవం సమీర్ సొంతం

సుదీర్ఘ అనుభవం సమీర్ సొంతం

కానీ, ఎటువంటి సందేహాలకు..వివాదాలకు తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతో వినాయక చవితి పండుగ నాడే సీఎం జగన్ కాబోయే నూతన సీఎస్ ఎంపిక పైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30వ తేదీన ఆదిత్య నాద్ దాస్ నుంచి సమీర్ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. 37 ఏళ్ల ఐఏఎస్ జీవితంలో సమీర్ శర్మ ఎన్నో పదవులు నిర్వహించారు. విజయవాడ-విశాఖ-హైదరాబాద్ మున్సిపల్ కమీషనర్ గా పని చేసారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు కీలక శాఖల బాధ్యతలు పర్యవేక్షించారు. కేంద్ర సర్వీసుల్లో భాగంగా స్మార్ట్ సిటీస్ కాన్సెప్ట్ లో ఆయన కీలక భూమిక పోషించారు.

4.

రెండు నెలలే పదవిలో..ఆ తరువాత

రెండు నెలలే పదవిలో..ఆ తరువాత

ఆర్దిక-వాణిజ్య విభాగాల్లో మంచి అనుభవం ఉన్న సమీర్ శర్మ నవంబర్ 30వ తేదీ వరకు సీఎస్ గా పదవిలో కొనసాగనున్నారు. ఆ తరువాత మరో మూడు నెలల పాటు ఆయన సేవలు పొడిగించే అవకాశం ఉంది. సీనియార్టీ వివాదాలు రాకుండా సమీర్ శర్మ ఎంపిక జరిగినట్లుగా తెలుస్తోంది. సమీర్ శర్మ తరువాత సీనియార్టీ జాబితాలో 1986 బ్యాచ్ కు చెందిన సతీష్ చంద్ర సైతం ఉన్నప్పటికీ..ఆయన చంద్రబాబు వద్ద ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ తరువాత వరుసగా నీరభ్ కుమార్ ప్రసాద్.. శ్రీలక్ష్మీ..ఇక, 1990 బ్యాచ్ కు చెందిన జవహర్ రెడ్డి పేర్లు వరుసగా రేసులో ఉన్నాయి.

రెండు నెలలే పదవిలో..ఆ తరువాత

ఆర్దిక-వాణిజ్య విభాగాల్లో మంచి అనుభవం ఉన్న సమీర్ శర్మ నవంబర్ 30వ తేదీ వరకు సీఎస్ గా పదవిలో కొనసాగనున్నారు. ఆ తరువాత మరో మూడు నెలల పాటు ఆయన సేవలు పొడిగించే అవకాశం ఉంది. సీనియార్టీ వివాదాలు రాకుండా సమీర్ శర్మ ఎంపిక జరిగినట్లుగా తెలుస్తోంది. సమీర్ శర్మ తరువాత సీనియార్టీ జాబితాలో 1986 బ్యాచ్ కు చెందిన సతీష్ చంద్ర సైతం ఉన్నప్పటికీ..ఆయన చంద్రబాబు వద్ద ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ తరువాత వరుసగా నీరభ్ కుమార్ ప్రసాద్.. శ్రీలక్ష్మీ..ఇక, 1990 బ్యాచ్ కు చెందిన జవహర్ రెడ్డి పేర్లు వరుసగా రేసులో ఉన్నాయి.

Recommended Video

Chetan Sharma Reveals Why Shikhar Dhawan Was Dropped From T20 World Cup 2021 Squad | Oneindia Telugu
ఎన్నికల నాటికి శ్రీలక్ష్మి లేదా జవహర్ రెడ్డి

ఎన్నికల నాటికి శ్రీలక్ష్మి లేదా జవహర్ రెడ్డి

అయితే, ఎన్నికల సమయానికి శ్రీలక్ష్మీ..లేదా జవహర్ రెడ్డి ఇద్దరిలో ఒకరిని సీఎస్ గా కొనసాగించేలా సీఎం జగన్ నిర్ణయం తీసుకొనే అవకాశాలు ఉన్నాయి. శ్రీలక్ష్మి 1987 బ్యాచ్ అధికారిణి కాగా, జవహర్ రెడ్డి 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం జవహర్ రెడ్డి ప్రతిష్ఠాత్మక టీటీడీ ఈవోగా ఉన్నారు. ఆయనకు మరింత కాలం సర్వీసు ఉండటంతో..ప్రస్తుతం సమీర్ శర్మ నవంబర్ 30వ తేదీ వరకు రెగ్యులర్ సర్వీసులో..ఆ తరువాత మూడు నెలలు ఎక్స్ టెన్షన్ పైన ఏపీ సీఎస్ గా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

English summary
IAS Sameer Sarma is appointed as next Chief Secretary of Andhra Pradesh. Presest CS Aditya nath das reires to the end of this month. Sameer Sarma will retire in novermber ending.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X