వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ కీలక నిర్ణయం - గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ : అదనపు నియామకాలతో..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో గ్రూపు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ పోస్టుల కంటే అదనపు పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. దీని ద్వారా ఏపీలో గ్రూపు -1, గ్రూపు -2 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. గత వారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రాష్ట్రంలో ఏకంగా 81 వేల ఉద్యోగాల భర్తీకి అసెంబ్లీకి ప్రకటన చేసారు. వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు. అదే సమయంలో కాంట్రాక్టు పోస్టుల్లో ఉన్న 11వేల మందిని రెగ్యులర్ చేస్తున్నట్లు చెప్పారు. దీంతో..ఏపీలోనూ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగింది.

 రాష్ట్రంలో 66 వేల పోస్టుల ఖాళీ

రాష్ట్రంలో 66 వేల పోస్టుల ఖాళీ

గతంలోనే సీఎం జగన్ ప్రతీ ఏటా జనవరి 1న ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలతో పాటుగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. కానీ, ప్రభుత్వంలో ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయనే అంశం పైన శాసనసభలో స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో 66వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు 7,71,177గా ఉన్నాయని.. ఇందులో 5,29,868 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారని స్పష్టం చేసింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 1 లక్షా 75 వేలు ఉన్నట్లు సభలో ప్రకటించింది.

గ్రూపు -1 గ్రూపు 2 అదనపు పోస్టుల భర్తీ

గ్రూపు -1 గ్రూపు 2 అదనపు పోస్టుల భర్తీ

త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పింది. ఇక, ఇప్పుడు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో గ్రూప్ 1 కేటగిరీ కింద 110 పోస్టులు, గ్రూప్‌-2 కేటగిరీ కింద 182 పోస్టులకు అనుమతి లభించినట్లైంది. ఏపీపీఎస్సీ త్వరలో నోటిఫికేషన్లు జారీ చేయటానికి కసరత్తు చేస్తోంది. ఈ నిర్ణయం ద్వారా డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీవో, సీటీవో, డిఎస్పీ, డి ఎఫ్ ఓ, మున్సిపల్ కమిషనర్, ఎంపిడివో పోస్టుల భర్తీకి, ఇక గ్రూప్‌-2 లో డిప్యూటీ తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్ లు, మున్సిపల్ కమిషనర్ లు, ట్రెజరీ అధికారులు తదితర ఖాళీల భర్తీకి రూట్ క్లియర్ అయింది.

ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా

ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా


సీఎం జగన్ నుంచి అనుమతి రావటంతో ఏపీపీఎస్సీ ఈ ఉద్యోగాల భర్తీ పైన త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. కొత్త జిల్లాలు ఏర్పుడుతన్న సమయంలో ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ప్రస్తుతానికి ఆర్డర్ టు సర్వ్ ఆదేశాలతో ఉద్యోగుల కేటాయింపులు చేస్తోంది. అదే సమయంలో కొత్త ఉద్యోగాల భర్తీ విషయంలో మాత్రం ఈ జిల్లాల ప్రక్రియ ముగిసిన తరువాతనే పూర్తి స్థాయిలో ఖాళీలను నిర్దారించి అన్ని స్థాయిల్లోని ఉద్యోగాలు భర్తీ చేస్ారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

English summary
CM Jagan approved to fill Group1, Group 2 posts in addition to job calender through APPSC, Shortly notification may issued.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X