జగన్ ఆపరేషన్ 2024 - 11 స్థానాల్లో అభ్యర్దుల ఖరారు, 3 మంత్రుల స్థానాలు మార్పు..!!
ముఖ్యమంత్రి జగన్ ఆపరేషన్ 2024 ప్రారంభించారు. వై నాట్ 175 లక్ష్యం కోసం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గెలుపే ప్రామాణికంగా అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా సీఎంకు సన్నిహితుడైన ఆర్కే ను మార్చారు. లోకేశ్..పవన్ కల్యాణ్ పైన గత ఎన్నికల్లో విజయం సాధించిన ఇద్దరినీ పక్కన పెట్టారు. ముగ్గురు మంత్రుల స్థాన చలనంతో సమా 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్ లను ప్రకటించారు.
జగన్ కొత్త లెక్కలు: ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల నిర్ణయాలు మొదలు పెట్టారు. సామాజిక - ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటే గెలుపు మాత్రమే ప్రాతిపదికగా అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. ముందుగా నియోజకవర్గ ఇంఛార్జ్ లుగా వారిని నియమించారు. నియోజకవర్గాల్లో అభ్యర్దుల మార్పులో భాగంగా తొలి జాబితాల లో 11 నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్ లను ప్రకటించారు.

మంత్రి విడదల రజనీ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరి పేట నుంచి గుంటూరు పశ్చిమం కు మార్చారు. చిలకలూరిపేటలో మల్లెల రాజేష్ నాయుడు అనే కొత్త అభ్యర్దికి బాధ్యతలు అప్పగించారు. మరో మంత్రి ఆదిమూలపు సురేష్ ను కొండెపికి మార్పు చేసారు. అక్కడ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అభ్యర్దుల ఖరారు: మరో మంత్రి మేరుగ నాగార్జునను వేమూరు నుంచి మార్చి ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఇంఛార్జ్ గా ప్రకటించారు. మాజీ హోం మంత్రి సుచరిత ను ప్రత్తిపాడు నుంచి మార్చి పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఉండవల్లి శ్రీదేవి నియోజకవర్గం తాడికొండ ఇంఛార్జ్ గా ఖరారు చేసారు. ప్రత్తిపాడు లో వైసీపీ కొత్త ఇంఛార్జ్ బాలసాని కిరణ్ కుమార్ ను నియమించారు.
వేమూరు నియోకవర్గంలో వరికూటి అశోక్ బాబుకు బాధ్యతలు అప్పగించారు. అద్దంకి బాద్యతలు పాణెం హనిమి రెడ్డికి కేటాయించారు. మంగళగిరిలో ఆర్కే స్థానం గంజి చిరంజీవికి బాధ్యతలు అప్పగించారు. అక్కడ టీడీపీ నేత నారా లోకేశ్ పైన వచ్చే ఎన్నికల్లో గంజి చిరంజీవి పోటీ చేయనున్నారు.

గెలుపే ప్రామాణికం: ఇక, రేపల్లె నుంచి టీడీపీలో మంత్రిగా పని చేసిన ఈపూరు సీతారావమ్మ కుమారుడు డాక్టర్ ఈపూరు గణేష్ ను ఇంఛార్జ్ గా నియమించారు. ఇక..2009 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పైన గాజువాక నుంచి గెలిచిన తిప్పారెడ్డి స్థానంలో వరికూటా రామచంద్రరావును సీఎం జగన్ ఖరారు చేసారు. కొద్ది రోజులుగా పలు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్దుల మార్పు ఖాయమనే ప్రచారం సాగింది.
తెలంగాణ ఎన్నికల తరువాత సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు పైన చర్చ మోదలైంది. దీంతో..జగన్ అటు టీడీపీ - జనసేన పొత్తు ఖాయం కావటంతో ప్రతీ సీటు పైన అన్ని కోణాల్లోనూ సమాచారం సేకరిస్తున్నారు. అన్నీ సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఈ 11 నియోజకవర్గాల్లో పార్టీ ఇంఛార్జ్ లను ప్రకటించారు.
-
రాజ్యసభలో అమరావతి బిల్లుపై రూటు మార్చిన వైసీపీ, అనూహ్య డిమాండ్..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ












Click it and Unblock the Notifications