• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవికి జగన్ ఆత్మీయ స్వాగతం: రాం చరణ్ గైర్హాజరు: కారణం అదేనా..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Chiranjeevi Meet AP CM YS Jagan Tadepalli House || రాం చరణ్ గైర్హాజరుకు కారణం ఏంటి..?? || Oneindia

మెగాస్టార్ చిరంజీవి దంపతులకు ముఖ్యమంత్రి జగన్ దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న చిరంజీవి దంపతులు తొలుత సోదరుడు పవన్ ఇంటికి వెళ్లారు. అక్కడి నుండి ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్నారు. వారిని ముఖ్యమంత్రి స్వాగతించారు. అయితే, తొలి నుండి చెబుతున్నట్లుగా సైరా నిర్మాత..చిరంజీవి తనయుడు రాం చరణ్ ఈ భేటీకీ గైర్హాజరయ్యారు. సైరా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వటం..ముఖ్యమంత్రిని చిరంజీవి కలవాలనుకోవంతో..సీఎం జగన్ ఆహ్వానం మేరకు విందు చిరంజీవి హాజరయ్యారు.

సీఎం జగన్ తో చిరంజీవి భేటీ: ముహూర్తం ఖరారు: సమావేశం ఎందుకంటే..!సీఎం జగన్ తో చిరంజీవి భేటీ: ముహూర్తం ఖరారు: సమావేశం ఎందుకంటే..!

అయితే, రాం చరణ్ చివరి నిమిషంలో రాకపోవటం పైన అనేక అనుమానలు షికారు చేస్తున్నాయి. ముఖ్యమంత్రితో చిరంజీవి..రాం చరణ్ భేటీ ఖరారైన తరువాత సోషల్ మీడియాలో నాడు జగన్ అరెస్ట్ సమయంలో రాం చరణ్ చేసిన కామెంట్లను గుర్తు చేస్తూ పోస్టింగ్ లు దర్శనమిచ్చాయి. దీని పైన వైసీపీ నేత సైతం వివరణ ఇచ్చారు. అయినా..రాం చరణ్ హాజరు కాకపోవటం పైన కారణాలు ఏంటనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

 సైరా కు సీఎం స్వాగతం..

సైరా కు సీఎం స్వాగతం..

సైరా సినిమాతో ఏర్పడిన బంధం..ఇప్పుడు ఆత్మీయంగా విండు సమావేశంగా మారింది. సైరా సినిమాకు ప్రత్యేక షోలకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు చెప్పేందుకు చిరంజీవి అప్పాయింట్ మెంట్ అడిగారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి సైతం చిరంజీవి దంపతులను తన ఇంటికి విందుకు రావాలని ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు చిరంజీవి దంపతులు హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. అక్కడ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆ వెంటనే వారు రోడ్డు మార్గంలో విజయవాడ చేరుకొని..అక్కడ నుండి ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. వారికి అక్కడ ముఖ్యమంత్రి దంపతుల నుండి ఘన స్వాగతం లభించింది. సీఎం జగన్ దంపతులు వారిద్దరికీ ఆత్మీయంగా స్వాగతం పలికారు.

రాం చరణ్ రాకపోవటం వెనుక..

రాం చరణ్ రాకపోవటం వెనుక..

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం చిరంజీవితో పాటుగా ఆయన తనయుడు రాం చరణ్ సైతం ముఖ్యమంత్రి తో సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. ఈ రోజు ఉదయం వరకూ రాం చరణ్ సైతం వస్తున్నారనే ప్రచారం సాగింది. సైరా ప్రత్యేక షోల ప్రదర్శనకు అనుమతి కోరుతూ ఏపీ ప్రభుత్వానికి కొణిదెల ఫిలింస్ నుండి లేఖ వచ్చింది. దీని ఆధారంగా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయతే, చిత్ర నిర్మాతగా ఉన్న రాం చరణ్ సైతం చిరంజీవితో పాటు వస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందించారు. అయితే, ఈ భేటీ ఖరారైన సమయం నుండి వైసీపీ ఎమ్మెల్యే అభిమాన సంఘం పేరుతో కొన్ని పోస్టింగ్ లు కనిపించాయి. అందులో జగన్ అరెస్ట్ సమయంలో రాం చరణ్ చేసిన కామెంట్ ను ప్రస్తావించారు. దీనిని వైసీపీ నేత తనకు సంబంధం లేదని ఖండించారు. దీని కారణంగానే రాం చరణ్ మనస్థాపానికి గురై..పాత విషయాలను ప్రస్తావిచటం నచ్చక భేటీకి రాలేదని ప్రచారం జరుగుతోంది. అయితే, 11న సమావేశానికి చిరంజీవితో పాటుగా రాం చరణ్ హాజరు కావాలని నిర్ణయించుకున్నారని.. సమావేశం 14వ తేదీకి వాయిదా పడటంతో మరో అప్పాయింట్ మెంట్ కారణంగా రాం చరణ్ రాలేకపోయారని మెగా సన్నిహితుల సమాచారం.

విందులో సీఎం...చిరు దంపతులు

విందులో సీఎం...చిరు దంపతులు

ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన విందులో చిరంజీవి దంపతులతో పాటుగా సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. 2009 ఎన్నికల ద్వారానే చిరంజీవి..జగన్ రాజకీయ రంగ ప్రవేశం చేసారు. అయితే, ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం చేయటం..తరువాత రాజకీయాలకూ చిరంజీవ దూరం కావటంతో..ఇప్పుడు ముఖ్యమంత్రి..సినీ హీరో హోదాలో ఇద్దరు కలుసుకున్నారు. అయితే, వీరిద్దరు గతంలో రాజకీయాల్లో ఉన్నా.. ఏనాడు ఒకరి పైన మరొకరు విమర్శలు చేసుకోలేదు. ప్రజారాజ్యం సమయంలో పవన్ నాటి సీఎం వైయస్సార్ మీద తీవ్ర విమర్శలు చేసారు. ఇక, ఇప్పుడు మాత్రం పాత విషయాలను పక్కన పెట్టి జగన్.. చిరు కుటుంబ సభ్యులతో కలిసి విందులో సినిమా..కుటుంబ విషయాలు పంచుకుంటున్నట్లు సమాచారం.

English summary
Syera chiranjeevi reached CM Jagan house along with his wife. Cm Jagan couple given grand welcome. But, Ram Charan did not attend the meeting. Many reasons sepculating on Charan absence. CM Host lusch for chiru.మెగాస్టార్ mobile summary
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X