సీఎం జగన్ మార్క్ నిర్ణయాలు - పార్టీ బాధ్యతల్లో మార్పులు..!!
ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న సమయంలో అసవరమైన మార్పులు మొదలు పెట్టారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు అందిరకీ సీట్లు రాకపోవచ్చనే సంకేతాలు ఇచ్చారు. దసరా నుంచి విశాఖలో పాలనకు సిద్దం అయ్యారు. ఈ సమయంలో పార్టీలో బాధ్యతల్లో మార్పులు మొదలు పెట్టిన ముఖ్యమంత్రి ..నామినేటెడ్ పదవుల పైన కసరత్తు ప్రారంభించారు.
జిల్లా అధ్యక్షుల మార్పు:ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల దిశగా ముందు పార్టీ ప్రక్షాళన ప్రారంభించారు. ఇందు కోసం పార్టీ పదవుల్లో మార్పులు..నామినెటెడ్ పదవుల భర్తీ పైన కసరత్తు చేస్తున్నారు. ఈ రోజు లేదా రేపు పార్టీ జిల్లా అధ్యక్షుల మార్పును ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో ముందుగా జిల్లా అధ్యక్ష బాధ్యుల మార్పు పైన ఫోకస్ చేసారు. జిల్లా అధ్యక్షుల బాధ్యతల నుంచి ఎమ్మెల్యేలను తప్పించాలని నిర్ణయించారు. ప్రస్తుతం అల్లూరి జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, కాకినాడ - కన్నబాబు, పొన్నాడ సతీష్ - కోనసీమ, శ్రీరంగనాధ రాజు - పశ్చిమ గోదావరి, జక్కంపూడి రాజా - తూర్పు గోదావరి, ఆళ్ల నాని - ఏలూరు, పేర్ని వెంకట రామయ్య (క్రిష్ణా), వెల్లంపల్లి శ్రీనివాస్ (ఎన్టీఆర్) లను మార్చటం ఖాయంగా కనిపిస్తోంది.

నియోజకవర్గాల్లో కీలకంగా:వీరితో పాటుగా పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి (పల్నాడు), కాటసాని రాం భూపాల్ రెడ్డి (నంద్యాల) శంకరనారాయణ( సత్యసాయి), గడికోట శ్రీకాంత్ రెడ్డి(అన్నమయ్య), డిప్యూటీ సీఎం నారాయణ స్వామి (చిత్తూరు) జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. వీరిని జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి తమ అసెంబ్లీ నియోజకవర్గాల పైనే దృష్టి సారించాలని సూచించారు. దీంతో, వీరిని పూర్తిగా ఎన్నికల కోసం పని చేసే విధంగా సిద్దం చేస్తున్నారు. దీంతో పాటుగా నామినేటెడ్ పదవుల పైనా పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ సమీక్షిచారు. పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తి చేసిన తరువాత జిల్లా అధ్యక్షుల మార్పుతో పాటుగా నామినేటెడ్ పోస్టులను అధికారికంగా ప్రకటించేందుకు రంగం సిద్దం అవుతోంది.
బాధ్యతలపై కసరత్తు:వీరిని పార్టీ బాధ్యతల నుంచి తప్పించి, పూర్తిగా నియోజకవర్గాలకు పరిమితం చేయటం ద్వారా వీరికి సీట్లు ఖాయమని స్పష్టం అవుతోంది. సీనియర్లు కొందరు ఎమ్మెల్యేలుగా.. పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. వారిని వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పార్టీకి అవసరమో అక్కడ వారి సేవలను వినియోగించుకోవాలనేది ముఖ్యమంత్రి జగన్ ఆలోచన. అందులో భాగంగానే కొన్ని నియోజకవర్గాల్లో వారసులకు లైన్ క్లియర్ చేస్తున్నారు. పార్టీ వాయిస్ ను బలంగా వినిపించే నేతలను పూర్తిగా ఎన్నికల సేవలను పరిమితం చేయనున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వారికి ప్రాధాన్యత ఇచ్చేలా హామీ ఇస్తున్నారు. దీంతో, పార్టీ పరంగా తీసుకొనే నిర్ణయాలు..చేసే నియామకాల పైన పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications