వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రులపై సీఎం జగన్ ఫైర్: యాక్టివ్ కాకుంటే ఇక అంతే: అగ్రిగోల్డ్ చెల్లింపుల ముహూర్తం ఖరారు ...!

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ సమావేశంలో మంత్రుల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. మంత్రులుగా ఉంటూ సచివాలయంలో అందుబాటులో ఉండటం లేదంటూ ఫైర్ అయ్యారు. అనేక మంది మంత్రులను కలవటానికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి వస్తుంటే..ఎందుకు అందుబాటులో ఉండటం లేదని ప్రశ్నించారు. అదే విధంగా కొందరు మంత్రులు శాఖల పైన ఇంకా పూర్తి స్థాయిలో పట్టు పెంచుకోవటం లేదని.. ప్రభుత్వంలోనూ..పార్టీ పరంగా మరింత యాక్టివ్ కావాలని సూచించినట్లు సమాచారం.

ఇసుక వ్యవహారం పైన చర్చ సమయంలో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం మీద ఉద్దేశ పూర్వకంగా ఆరోపణలు చేస్తుంటే మంత్రులు సరైన రీతిలో స్పందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అయిదు నెలల కాలం ముగిసిందని..ఇప్పటికీ మంత్రులు యాక్టివ్ కాకపోవటం ఏంటని ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. ఇదే సమయంలో మంత్రులంతా ఖచ్చింగా ప్రతీ మంగళవారం..బుధవారం సచివాలయంలో అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారని సమాచారం.

CM Jagan fire on Ministers directed them to be available in Secreteriat for visitors

ప్రతీ రెండు..నాలుగో బుధవారం కేబినెట్ సమావేశాలు ఉంటాయని..ప్రతీ అంశం మీద సూక్ష్మ స్థాయిలో అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారని తెలుస్తోంది. బాలక్రిష్ట వియ్యంకుడికి జయంతీపురంలో కేటాయించిన భూములను రద్దు చేయాలని.. అక్కడ కెమికల్ ఫ్యాక్టరీ పెడితే ప్రజల ఆరోగ్యానికి ప్రమాదమని...స్థానికుల నుండి ఇబ్బందులు వస్తాయని మంత్రులు సీఎంకు నివేదించారు.

నవంబర్ ఏడో తేదీన అగ్రీ గోల్డ్ బాధితులకు చెల్లింపులు...
అగ్రిగోల్డ్ డిపాజిట్ల పేరుతో నష్టపోయిన బాధితులకు అండగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత పది వేల రూపాయాల వరకు ఉన్న డిపాజిట్ దారులకు చెల్లింపులు చేయాలని భావించిన ప్రభుత్వం .. తాజాగా రూ. 20వేల లోపు ఉన్న డిపాజిట్ దారులకు చెల్లింపులు చేయాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ ఏడో తేదీన ఈ మేరకు చెల్లింపులు చేయాలని నిర్ణయించారు. అదే విధంగా నవంబర్ లో ప్రారంభించే పలు పధకాల పైన చర్చ చేసారు. నవంబర్ 14 నుంచి నాడు-నేడు పథకం ప్రారంభించనున్నారు.

నవంబర్ 21న ఫిషింగ్ బోట్లకు సబ్సిడీపై డిజీల్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభించాలని కేబినెట్ లో నిర్ణయించారు. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్ధిక సాయం అందచేయనున్నారు. ఇక, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పద్మ అవార్డుల తరహాలో రాష్ట్ర ప్రభుత్వం సైతం వివిధ రంగాల్లో ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన వారికి వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డుల అందచేసేందుకు కెబినెట్ ఆమోదం తెలిపింది. వీటిని జనవరి-26, ఆగస్టు-15 రెండు సార్లు అవార్డుల అందచేయాలని నిర్ణయించారు. దీని ద్వారా పురస్కార గ్రహీతలకు రూ. 10 లక్షలు పారితోషికం ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు.

English summary
CM Jagan fire on Ministers directed them to be available in Secretariat for visitors. Cabinet decided to pay up to 20000 rupees for agri gold victims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X