ఢిల్లీ టూర్ ఎఫెక్ట్ : చంద్రబాబు- పవన్ కు సీఎం జగన్ భారీ పంచ్ లు : 8 మందిని చంపేసారు..!!

ముఖ్యమంత్రి జగన్ స్వరం పెంచారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం జగన్ ప్రతిపక్ష నేతలపై గురి పెట్టారు. నర్సీపట్నం వేదికగా చంద్రబాబు- పవన్ పైన ఒక రేంజ్ లో విరచుకుపడ్డారు. ఈ ఇద్దరి స్టైల్ అంటూ తమ మార్క్ పంచ్ లతో ఫైర్ అయ్యారు. డ్రోన్ షాట్స్ కోసం ఇరుకు సందుల్లో జనాన్ని తీసుకొచ్చి 8 మందిని చంపేసారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. చేసేదే చెబుతాను..చెప్పించే చేస్తానుే.. జగన్ ఇలాగే బ్రతుకుతాడంటూ ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. పెన్షన్లు తగ్గించే ప్రసక్తే లేదని..జగన్ మనసు అది కాదని స్పష్టం చేసారు. ఈ రాష్ట్రం కాకుంటే మరో రాష్ట్రం.. ఈ పార్టీ కాకుంటే మరో పార్టీ.. ఈ భార్య కాకుంటే మరో భార్య అన్నట్లుగా వారి తీరు ఉంటుందని మండిపడ్డారు. దత్తపుత్రుడు రాజకీయానికి చంద్రబాబు నిర్మాత కం దర్శకుడు అని సీఎం చెప్పుకొచ్చారు.

చంద్రబాబు - పవన్ స్టైల్ ఒక్కటే

చంద్రబాబు - పవన్ స్టైల్ ఒక్కటే

దుష్ట చతుష్టయం తమ మనిషిని సీఎం చేయటం కోసం నిజాలను అబద్దం చేసే ప్రయత్నం చేస్తుందని ముఖ్యమంత్రి మండిపడ్డారు. చంద్రబాబు - పవన్ ఒకే స్టైల్ లో పని చేస్తున్నారన్నారు.ఈ రాష్ట్రం కాకుంటే ఆ రాష్ట్రం, ఈ ప్రజలు కాకుంటే ఆ ప్రజలు, ఈ పార్టీతో కాకుంటే ఆ పార్టీతో, ఈ భార్యతో కాకపోతే ఆ భార్యతో అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విశ్లేషించారు. వీరిద్దరి చూసి రాష్ట్ర ప్రజలు ఇదేం ఖర్మరా ఈ రాష్ట్రానికి.. రాజకీయానికి అనుకుంటున్నారని వివరించారు. పరోక్షంగా పవన్ ను ప్రస్తావిస్తూ రాజకీయ పార్టీ పెట్టి 14 ఏళ్లు అయిందని..రెండు చోట్ల ప్రజలు ఓడించారన్నారు. ఒక్క ఎమ్మెల్యే లేరని చెప్పారు. ఆయనకు రాజకీయ నిర్మాత - దర్శకుడు చంద్రబాబు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఎప్పుడు షూటింగ్ ఉందంటే అప్పుడు అక్కడకు వెళ్తారన్నారు. ఆయన అడిగిన వెంటనే కాల్షీట్లు ఇస్తారని.. చెప్పిన డైలాగ్స్ తో యాక్ట్ చేసి చూపుతారని ఫైర్ అయ్యారు.

ఈ 73 ఏళ్ల ముసలాయన్ను చూస్తే ఆ రెండే గుర్తుకొచ్చేది..

ఈ 73 ఏళ్ల ముసలాయన్ను చూస్తే ఆ రెండే గుర్తుకొచ్చేది..


చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క మంచి పని చేసారా అని సీఎం జగన్ ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా చేసానని చెప్పుకొనే చంద్రబాబు...కుప్పంకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. కుప్పం ను ఈ ప్రభుత్వం రెవిన్యూ డివిజన్ గా మార్చిందని చెప్పుకొచ్చారు. ఏ మంచి జరిగినా తన వలనే జరిగిందని చెబుతారన్నారు. సింధు బ్యాడ్మింటన్ లో గెలిచినా తానే నేర్పించానని చెప్పుకుంటారని ఎద్దేవా చేసారు. ఈ 73 ఏళ్ల ముసలాయన్ను చూస్తూ గుర్తుకు వచ్చేది వెన్నుపోటు - మోసం అని సీఎం ఫైర్ అయ్యారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా మంచి చేసి ఉంటే ప్రజలు ఎందుకు ఇంటికి పంపిస్తారని జగన్ ప్రశ్నించారు. రాజకీయాలంటే డ్రోన్లు ..డైలాగులు కాదన్నారు. తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 95 శాతం ఇప్పటికే అమలు చేసామని చెప్పారు. చెప్పింది చేసామనే ధైర్యంతో పార్టీ నేతలు ప్రతీ ఇంటికి ధైర్యంగా వెళ్తున్నారని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. తాజాగా కందుకూరులో ఇరుక సందుల్లో సభలు పెట్టి.. డ్రోన్ విజువల్స్ కోసం తన వాహనం ముందుకు తీసుకొచ్చి అమాయకులను చంపేసారని సీఎం వ్యాఖ్యానించారు. గతంలో ఇదే రకమైన ప్రచారం కోసం సామాన్యుల ప్రాణాలను బలి తీసుకున్నారని ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు.

జగన్ అలాగే బతుకుతాడంటూ..

జగన్ అలాగే బతుకుతాడంటూ..


ముఖ్యమంత్రి తన విధానాలను స్పష్టం చేసారు. చెప్పిందే చేస్తానని.. చేసేదే చెబుతానని..జగన్ అలాగే బతుకుతాడంటూ ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. జనవరి నుంచి పెన్షన్ 2500 నుంచి 2750 కి పెంచుతున్నామన్నారు. దీనిని తట్టుకోలేకనే పెన్షన్లలో కోత విధిస్తున్నామనే ప్రచారం ప్రారంభించారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో 39 లక్షల మందికి రూ 400 కోట్ల పెన్షన్ లు ఇస్తే..ఇప్పుడు ప్రతీ నెలా 62 లక్షల 30 వేల మందికి రూ 1700 కోట్ల మేర పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. ప్రతీ ఆరు నెలలకోసారి జరిగే ఆడిట్ లో భాగంగా జరిగే ప్రక్రియను చూపిస్తూ పెన్షన్లను కోత విధిస్తున్నారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన పూర్తయిన తరువాత ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్న ఈ సభలో చంద్రబాబు - పవన్ పైన మాటల తీవ్రత పెంచారు. ఎన్నికల ప్రచారం తరహాలో ప్రత్యర్ధి పార్టీల నేతలను సీఎం జగన్ టార్గెట్ చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+