వైసీపీలో ఆ నలుగురి వారసులకు గ్రీన్ సిగ్నల్ - సీఎం జగన్ తాజా నిర్ణయంతో..!!
వైసీపీలో ఎన్నికల ఫీవర్ మొదలైంది. సర్వేల హంగామా కొనసాగుతోంది. సీఎం జగన్ ఏకంగా మూడు విధాలుగా ఎమ్మెల్యే పని తీరు పైన సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నారు. నియోజకవర్గాల సమీక్షల్లో ఎమ్మెల్యేలు ఎవరో క్లారిటీ ఇస్తున్నారు. కానీ, పార్టీలో పలువురు నేతలు ఈ ఎన్నికల్లో తమ వారసులకు అవకాశం ఇవ్వాలని ఆశిస్తున్నారు. ఇందు కోసం ఇప్పటికే నియోజకవర్గాల్లో వారసులు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. కానీ, తాజాగా సీఎం జగన్ వారసుల విషయంలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇద్దరు సీనియర్ నేతలకు టికెట్లు లేవని తెలుస్తోంది.

వారసులపై సీఎం వ్యాఖ్యలతో..
కొద్ది నెలల క్రితం పార్టీ వర్క్ షాపులో వారసుల అంశం పైన సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. మంతి బుగ్గన..మాజీ మంత్రి పేర్ని నాని వచ్చే ఎన్నికల్లో తమ వారసులకు అవకాశం ఇవ్వాలని కోరిన అంశాన్ని సీఎం వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లోనూ వారిద్దరే పోటీ చేయాలని..తిరిగి వచ్చే ప్రభుత్వంలో తనతో కలిసి పని చేయాలని సీఎం తేల్చి చెప్పారు. సీఎంకు సన్నిహితంగా ఉండే ఆ ఇద్దరి నేతల విషయంలోనే సీఎం జగన్ క్లారిటీ ఇవ్వటంతో, వారసుల ఎంట్రీకి రంగం సిద్దం చేసుకున్న నేతల్లో గుబులు మొదలైంది. మంత్రులు విశ్వరూప్, బొత్సా సత్యానారాయణ తో సహా సీనియర్ నేతలు తమ వారసులకు నియోజకవర్గా ల్లో లైన్ క్లియర్ చేస్తున్నారు. వీరితో పాటుగా మరో 14 మంది పార్టీ సీనియర్ నేతలు తమ వారసులకు అవకాశం ఇవ్వాలని కోరుతూ వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి జగన్ ను అభ్యర్దించారు. వీరిలో కొందరికి సంబంధించి సీఎం సానుకూలంగా స్పందించారు. వారి నియోజకవర్గాల్లో వారసులకు సంబంధించి సర్వేలకు సూచించారు. కొన్ని నియోజకవర్గాల్లో రిపోర్టులు కూడా అందినట్లు తెలుస్తోంది.

ఆ నలుగురికి లైన్ క్లియర్...
వారసులకు సీట్లు ఇవ్వాలని కోరుతున్న నేతల్లో నలుగురికి సంబంధించి సర్వే నివేదిక ఆధారంగా దాదాపు లైన్ క్లియర్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. అనారోగ్యంతో ఉన్న మంత్రి విశ్వరూప్ స్థానంలో ఆయన కుమారుడికి సీటు ఇవ్వటం ఖాయమైందని సమాచారం. అయితే, వారి కుటుంబంలో ఏకాభిప్రాయంతో వస్తేనే నిర్ణయం ఉంటుందని పార్టీ ముఖ్యులు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నెకేవశ రెడ్డి అనారోగ్యం - వయో భారం కారణంగా తన కుమారుడికి వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పించాలని సీఎం ను కోరారు. చెన్న కేశవ రెడ్డి తొలి నుంచి తనతో పాటుగా ఉండటంతో..ఆయన అభ్యర్ధన మేరకు కర్నూలు జిల్లా ఎమ్మగినూరు నుంచి చెన్నకేశవ రెడ్డి కుమారుడికి ఆమోదం దక్కిందని..అయితే, సీఎం జగన్ తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది. ఇదే సమయంలో తాజాగా..రీజనల్ కో ఆర్డినేటర్లు.. జిల్లా అధ్యక్షుల మార్పు సమయంలోనూ జగన్ నిర్ణయాలతో మరో ఇద్దరి నేతల వారసులకు లైన్ క్లియర్ అయింది.

భూమన - చెవిరెడ్డికి సీట్లు లేనట్లే
చిత్తూరు జిల్లా లో వైసీపీ కీలక నేతలుగా ఉన్న ఇద్దరు నేతలకు ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. తమ వారసులకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే భూమన కరుణాకర రెడ్డి.. చెవిరెడ్డి భాస్కర రెడ్డి సీఎం ను కోరారు. భూమన సేవలను వచ్చే ఎన్నికల్లో పార్టీకి వినియోగించుకోవాలని సీఎం భావిస్తున్నారు. అందులో భాగంగానే..కీలకమైన పల్నాడు జిల్లా బాధ్యతలను సీఎం జగన్ సీనియర్ నేత భూమనకు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తనయుడు అభినయ్ తిరుపతి నుంచి పోటీకి లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. ఇక, చెవిరెడ్డికి పార్టీ అనుబంధ విభాగాల సమన్వయకర్తగా బాధ్యతలు కేటాయించారు. ఎన్నికల సమయంలో అనుబంధ విభాగాల పాత్ర కీలకం. దీంతో, చెవిరెడ్డి కుమారుడు వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీ చేయటం ఖాయమని తెలుస్తోంది. మిగిలిన నేతలకు సంబంధించి సర్వే నివేదికల ఆధారంగా సీఎం జగన్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications