సీఎం జగన్ లో సడన్ ఛేంజ్- దిద్దుబాటు చర్యలు: ఆ ఇద్దరి ప్రభావమేనా - చంద్రబాబు బలాల పై గురి...!!

సీఎం జగన్ లో సడన్ ఛేంజ్. ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో తెలిసిన వారిదే విజయం. ఇప్పుడు సీఎం జగన్ ఫాలో అవుతున్న ఫార్ములా ఇదే. రెండున్నారేళ్లు తన మాటే శాసనం అనే తరహాలో నిర్ణయాల అమలు కు అడుగులు వేసారు. అనేక అంశాల్లో కోర్టు నుంచి ఎదురు దెబ్బలు తగిలాయి. అనూహ్య మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్..తీసుకున్న కొన్ని కీల నిర్ణయాలను ఇప్పుడు దిద్దుబాటు చేస్తున్నారు. రెండున్నారేళ్ల పాలన తరువాత సీఎం తన నిర్ణయాలను మార్చుకోవటానికి ఏ మాత్రం బేషజాలకు పోవటం లేదు.

రాజధానుల నుంచి మద్యం పాలసీ దాకా

రాజధానుల నుంచి మద్యం పాలసీ దాకా

మూడు రాజధానుల నుంచి మద్యం పాలసీ దాకా అనేక నిర్ణయాల్లో దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. అయితే, సీఎం లో ఈ మార్పుకు కారణమేంటనే చర్చ మొదలైంది. గత నెలలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తిరుపతిలో సదరన్ రీజనల్ కౌన్సిల్ సమావేశానికి వచ్చారు. ఆ సమావేశం లో జగన్ సైతం పాల్గొన్నారు. ఆ తరువాత వరుసగా సీఎం ఈ దిద్దుబాటు నిర్ణయాలు అమలు చేస్తున్నారు. అందులో కీలకమైన మూడు రాజధానుల బిల్లు జగన్ ప్రభుత్వం వెనక్కు తీసుకోవటం పైన పెద్ద ఎత్తున చర్చ సాగింది.

వెనుకడుగా.. వ్యూహాత్మకమా

వెనుకడుగా.. వ్యూహాత్మకమా

అయితే, ఆ నిర్ణయం తాత్కాలికమేనని..మెరుగైన బిల్లుతో ముందుకు వస్తామంటూ సీఎం నాడు సభలో ప్రకటించారు. సాంకేతిక కారణాలతో బిల్లులకు అడ్డంకులు అని ప్రభుత్వం చెబుతున్నా.. బిల్లులు పాస్ చేసే సమమంలోనే ఆ చర్చ జరిగినా..నాడు పట్టించుకోలేదు.

ఇక, కేంద్రంలో ప్రధాని రైతు చట్టాలను వెనక్కు తీసుకోవటం..ఇక్కడ సీఎం మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకోవటం వెనుక తిరుపతి మీట్ ఎఫెక్ట్ ఉందనే ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో జగన్ 2019లో అధికారం దక్కించుకోవటంలో తెర వెనుక కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ సూచనలు సైతం ఉన్నాయనే ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది.

తిరుపతి సమావేశంతో మార్పు మొదలు

తిరుపతి సమావేశంతో మార్పు మొదలు

సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాల్లో వేటి పైన వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో పీకే తన సంస్థ ద్వారా సర్వే చేయించి సీఎంకు నివేదించారని సమాచారం. దీంతో..సీఎం వెంటనే దిద్దుబాటు చర్యల్లో భాగంగా మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నారు. ఆ వెంటనే పార్టీ నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కటం.. పూర్తి మెజార్టీ రావటంతో మండలి రద్దు నిర్ణయాన్ని ఉప సంహరించుకున్నారు.

ఇక, మద్య పాలసీ పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాని పైన నిర్ణయాలను మార్చుకున్నారు. గతంలో దొరికిన పాత బ్రాండ్లకు తిరిగి అవకాశం ఇవ్వటంతో పాటుగా... మద్యం ధరల ను తగ్గించారు. ఇక, ఏపీకి వచ్చిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు సీఎం జగన్ తగిన రీతిలో గౌరవించి..సత్కరించారు. సీజేఐ కు స్వాగతం పలుకుతూ ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున సీజేఐ - సీఎం ఫొటోలు ఉన్న ఫ్లెక్సీ లతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేసారు. దీని ద్వారా సీఎం జగన్ బలమైన సంకేతాలను పంపారు. విమర్శలకు చెక్ పెట్టారు. ఇక, అమరావతి విషయంలోనూ జగన్ ప్రభుత్వంలో మార్పు కనిపిస్తోంది.

చంద్రబాబు బలాలను లక్ష్యంగా చేసుకుంటూ

చంద్రబాబు బలాలను లక్ష్యంగా చేసుకుంటూ

అమరావతిలో మౌళిక వసతుల కోసం జగన్ ప్రభుత్వం పది వేల కోట్ల రుణం తీసుకుంటున్నట్లుగా హైకోర్టులో ప్రభుత్వమే అఫిడవిట్ లో స్పష్టం చేసింది. ప్రస్తుతం హైకోర్టు ఉన్న అమరావతి గ్రామం నేలపాడు లోనే హైకోర్టు ఎక్స్ టెన్షన్ భవనానికి నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఇప్పుడు ప్రభుత్వం - పార్టీలో కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తున్నారు.

దీంతో.. పాలిటిక్స్ ఆర్ డైమిన్ - నాట్ కాంస్టంట్ అనేది ఇక్కడ స్పష్టం అవుతోంది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న చంద్రబాబు ఏ అంశాల్లో తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో..అసలు ఆ అంశాలే సమస్య కాకుండా చేయటం జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది.

చంద్రబాబు ఎక్కడ ఏ అంశాల్లో బలంగా కనిపిస్తున్నారో..అక్కడ తన బలం పెంచుకొనే ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో.. రానున్న రోజుల్లో సీఎం జగన్ మరిన్ని కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేయటం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+