అప్రమత్తంగా ఉండాల్సిన సమయం - సీఎం జగన్ కీలక ఆదేశాలు..!!

ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాల పైన మాండూస్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మూడు రోజులపాటు దక్షిణకోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణ శాఖ అధికారుల సమాచారంతో పాటుగా ప్రభుత్వ అధికారులు దీనిని ఎదుర్కోవటానికి సంసిద్దులై ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేసారు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన ముందుగానే అలర్ట్ చేయాలని సూచించారు.

తుఫాను ప్రభావంతో ఈ మధ్నాహ్నం నుంచి తమిళనాడులో వర్షాలు మోదలయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ఉదయం వాతావరణ శాఖ విడుదల చేసిన సమాచారం మేరకు మాండూస్ తుఫాను ప్రస్తుతానికి కారైకాల్‌కు తూర్పు-ఆగ్నేయంగా 530 కి.మీ., చెన్నైకి 620 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. తుఫాను నేపధ్యంలో కామన్ అలర్ట్ ప్రోటోకాల్ ద్వారా ఆరు జిల్లాల్లోని కోటిమందికి పైగా సబ్ స్ర్కైబర్లకి హెచ్చరిక సందేశాలు పంపారు. తుఫాను గమనాన్ని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తున్నారు. పశ్చిమ-వాయువ్య దిశగా తుఫాను పయణిస్తోందని చెప్పుకొచ్చారు. రేపు అర్ధరాత్రి పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు.

CM Jagan has put on high alert administration over Mandous Cyclone alerts

తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందననారు. ఇప్పటికే ముందస్తు చర్యల్లో భాగంగా సహాయక చర్యలకోసం 5-ఎన్డీఆర్ఎఫ్, 4-ఎస్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాల్లో మొహరించారు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అదే సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ తుఫాను కారణంగా తమిళనాడు, పుదుచ్చేరీ, ఏపీలోని కోస్తా ప్రాంతం పైన ప్రభావం ఉంటుంది ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో, సీఎం జగన్ అలర్ట్ జారీ అయిన ఆరు జిల్లాల్లోనూ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

CM Jagan has put on high alert administration over Mandous Cyclone alerts
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+