నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆనం వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్... సంజాయిషీ నోటీసు ఇవ్వాలని ఆదేశం

|
Google Oneindia TeluguNews

నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్‌మోమన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆనం చేసిన వ్యాఖ్యలపై విజయసాయి రెడ్డితో చర్చించారు. అనంతరం ఆనం నెల్లూరులో మాఫియా చెలరేగుతుందంటూ.. చేసిన వ్యాఖ్యలపై ఆయన సీరియస్ అయినట్టు సమాచారం. అధికార పార్టీలో ఉంటూ ఇలాంటీ వ్యాఖ్యలు చేయడం పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఆయన వ్యాఖ్యలపై సంజాయిషీ నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్టు తెలుస్తోంది. అవసరమైతే పార్టీ నుండి సస్పెండ్ చేయాలనే యోచనలో కూడ ఉన్నట్టు పార్టీ నేతల సమాచారం.

వైసీపీలో ఆనం కామెంట్ల రచ్చ.. విచారణకు ఓకే, మంత్రి అనిల్, జగన్ మాటే ఫైనల్ విజయసాయి..వైసీపీలో ఆనం కామెంట్ల రచ్చ.. విచారణకు ఓకే, మంత్రి అనిల్, జగన్ మాటే ఫైనల్ విజయసాయి..

 ఆనం వ్యాఖ్యలతో హీటెక్కిన నెల్లూరు రాజకీయం

ఆనం వ్యాఖ్యలతో హీటెక్కిన నెల్లూరు రాజకీయం

నెల్లూరు జిల్లా రాజకీయాలు అధికార పార్టీలో మరోసారి హిటెక్కాయి. మాజీ మంత్రి ఆనం రాంనారయణ రెడ్డి నెల్లూరు జిల్లాలో మాఫియా రాజ్యం ఏలుతుందని, పోలీసు వ్యవస్థ కూడ సరిగా పని చేయడం లేదని ఆయన స్వంత పార్టీ నేతలపై ఫైర్ అయ్యారు. పార్టీ నేతలు వ్యవస్థలు తమ పనితాము చేసుకోకుండా అడ్డు తగులుతున్నారని అన్నారు. మాఫియా ఆగడాల గురించి ఎవరికి చెప్పాలో ప్రజలకు అర్థం కావడం లేదని ఆయన ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా నెల్లూరులో కబ్జాకోరులు, బెట్టింగ్ రాయుళ్లు, ల్యాండ్ ,శాండ్ మాఫీలకు అడ్డంగా మారిందని అన్నారు.

అసంతృప్తిలో ఆనం కుటుంబం

అసంతృప్తిలో ఆనం కుటుంబం

నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబం రాజకీయ ఆదిపత్యాన్ని కొనసాగిస్తుంది. రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్న ఆనం రాంనారయణ రెడ్డి కుటుంబానికి సంబంధించి ఆధిపత్యం కొల్పోయో విధంగా అక్కడి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ నాయకుడిగా ఉన్న ఆనంకు మంత్రి పదవి దక్కకపోవడంతో పాటు ఇటివల ఆయన స్వంత నియోజకవర్గంలోని అభివృద్ది పనుల్లో మంత్రుల జోక్యం చేసుకుంటుండడంతో ఆనం కుటుంబం కోంత అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆనం రాంనారణ రెడ్డి ఇటివల రేణిగుంట ఏయిర్ పోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబును కూడ కలిసినట్టు ప్రచారం జరుగుతుంది.

అవసరమైతే సస్పెన్షన్

అవసరమైతే సస్పెన్షన్

ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ పలు అంశాలను చర్చించినట్టు తెలుస్తోంది. ఇక చంద్రబాబును కలిసిన అంశంపై కూడ వైసీపీ నేతల వద్ద ఆధారాలు ఉన్నట్టు చెబుతున్నారు. కాగా తాజాగా ఆనం ప్రతిపక్ష పార్టీలకు ఆయుధం ఇచ్చే విధంగా స్వంత పార్టీ నేతలపైనే వ్యాఖ్యలు చేయడం , సీనియర్ నేతగా ఉండి, సమస్యల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లకుండా బహిరంగంగా మీడీయా ముందు ప్రకటించడంపై సీఎం జగన్ సీరీయర్ అయ్యారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అవసరమైతే పార్టీ నుండి సస్పెండ్ చేయాలనే ఆలోచన కూడ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఆయన సంజాయిషీ సమాధానాన్ని బట్టి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. అయితే పార్టీ మాత్రం ఆయన అసంతృప్తికి గల కారణాలు కూడ కనుక్కోవాలని జిల్లా ఇంచార్జులకు ఆదేశాలు కూడ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

English summary
CM Jaganmoman Reddy has seriously reacted on comments of Venkatagiri MLA Anam Ramnarayana Reddy.he discussed with Vijayasai Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X