ఈ 44 నియోజకవర్గాల్లో వైసీపీకి డేంజర్ బెల్
మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగానే వై నాట్ 175 అన్న నినాదంతో ముందుకు సాగుతున్నారు. సర్వేల్లో, ప్రజల్లో బలమున్న నేతలకే టికెట్లు కేటాయించారు. దాదాపు 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించి సంచలనం సృష్టించారు. మరికొందరుకు స్థానచలనం కల్పించారు. మరోవైపు జగన్ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు కూటమి కట్టగా.. ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన వైసీపీదే గెలుపు అని పార్టీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తమ దగ్గరున్న అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది అధికార పార్టీ. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత ప్రణాళికలు రచిస్తున్నారు.ఈ నేపథ్యంలో జగన్ ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. రాయలసీమలో వైసీపీ బలంగా కనిపిస్తున్నప్పటికీ .. కోస్తాతో పాటు ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొంత ప్రతికూలత వ్యక్తం అవుతోంది.దీంతో ఆయా జిల్లా నేతలను పిలిచి వారితో సీఎం జగన్ నేరుగా మాట్లాడుతున్నారు.

ముఖ్యంగా గత ఎన్నికల్లో మెజార్టీ తగ్గిన స్థానాలపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టిని సారించారు. 2019 ఎన్నికల్లో దాదాపు 44 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10లోపు మెజార్టీ రావడం జరిగింది. ఈ 44స్థానాలను కాపాడుకోకపోతే అధికారానికి దూరం కావడం ఖాయమని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు ఆ 44తో పాటు, మరికొన్ని నియోజకవర్గాలపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది.
మొత్తం 68 నియోజకవర్గాలపై సీఎం జగన్ రివ్యూ నిర్వహించినట్టుగా సమాచారం అందుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ నియోజకవర్గాల్లో తిరిగి విజయం సాధించడంతో పాటు, మెజార్టీ కూడా భారీగా రావాలని ఆ నియోజకవర్గ అభ్యర్థులకు జగన్ దిశానిర్దేశం చేశారట. ఇప్పటికే దీనిపై నియోజకవర్గ పరిశీలకులతో మాట్లాడిన సీఎం జగన్..అక్కడ చేపట్టాల్సిన కార్యక్రమాలతో పాటు, పార్టీ బలోపేతం చేయడానికి సంబంధించిన అంశాల గురించి వారితో చర్చించినట్టుగా తెలుస్తోంది.
గత ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ తగ్గిన నియోజకవర్గాలను ఓసారి పరిశీలిస్తే...
విజయవాడ సెంట్రల్ (25)
తిరుపతి (708)
పొన్నూరు (1112)
నెల్లూరు సిటీ (1988,)
తణుకు (2195)
నగిరి (2708)
కొత్తపేట (4038)
ఏలూరు (4072)
ఎలమంచిలి (4146)
తాడికొండ (4433)
ప్రత్తిపాడు (4611)
జగ్గయ్యపేట (4778)
వంటి నియోజకవర్గాల్లో ఐదు వేలు లోపు మాత్రమే మెజార్టీ రావడం జరిగింది.
పదివేల లోపు మెజారిటీ దక్కించుకున్న స్థానాలను పరిశీలిస్తే..
రామచంద్రపురం (5168)
మంగళగిరి (5337)
కర్నూలు (5353)
ముమ్మిడివరం (5547)
శ్రీకాకుళం (5777)
మచిలీపట్నం (5851)
విజయనగరం (6417)
నరసాపురం (6436)
ప్రత్తిపాడు (7398)
తాడిపత్రి (7511)
విజయవాడ వెస్ట్ (7671)
పెడన (7839)
పీలేరు (7874)
అనకాపల్లి (8169)
చిలకలూరిపేట (8301)
బొబ్బిలి (8352)
భీమవరం (8357)
కాకినాడ రూరల్ (8789)
సంతనూతలపాడు (9078)
కైకలూరు (9357)
భీమిలి (9712)
వేమూరు (9999)
నియోజకవర్గాల్లో పదివేలు లోపు మాత్రమే మెజార్టీ రావడం జరిగింది. అందుకే ఈ 44 నియోజకవర్గాలపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications