కడపలో బిజీబిజీగా సీఎం జగన్: రిమ్స్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం!!
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల పర్యటన నిమిత్తం కడప చేరుకున్నారు. సీఎం జగన్ కడప పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. కడప రిమ్స్ లో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. అంతేకాదు రిమ్స్ ప్రాంగణంలోనే క్యాన్సర్ విభాగాన్ని, మానసిక వైద్యశాలను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. సీఎం జగన్ తన పర్యటనలో భాగంగా కడపలోని ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
అంతేకాదు దివ్యాంగులకు ట్రై స్కూటర్లను పంపిణీ చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అనంతరం ఆధునీకరించిన కలెక్టరేట్ భవనాన్ని జగన్ ప్రారంభించారు. ఆపై అంబేద్కర్ సర్కిల్ కు చేరుకున్న చేరుకున్న జగన్ అంబేద్కర్ సర్కిల్ ను ప్రారంభించారు. అనంతరం కడప కోటిరెడ్డి సర్కిల్ చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి కడప కోటిరెడ్డి సర్కిల్ లో గాంధీజీ దండి మార్చ్ విగ్రహాలను ఆవిష్కరించారు.

అంతేకాదు సీఎం జగన్ రూ .1000 కోట్లతో ఏర్పాటు చేసిన సెంచురీ ప్లై పరిశ్రమను ప్రారంభించారు. ఈ పరిశ్రమ వల్ల 2 వేల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభించనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఈ రోజంతా అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం సీఎం జగన్ ఇడుపులపాయ చేరుకుని రాత్రికి వైఎస్సార్ ఎస్టేట్ లోని గెస్ట్ హౌస్ లో బస చేస్తారు.
రేపు డిసెంబర్ 24వ తేదీన వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి దివంగత రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత ఇడుపులపాయ ప్రార్థనా మందిరంలో దైవ ప్రార్థనలకు జగన్ హాజరవుతారు. మధ్యాహ్నం నుంచి సింహాద్రిపురంలో పర్యటించి, వివిధ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో సీఎం జగన్ పాల్గొంటారు.
అనంతరం, ఇడుపులపాయ ఎకో పార్కులో పులివెందుల మండల ప్రజాప్రతినిధులను కలుస్తారు. ఆపై రేపు రాత్రి కూడా ఇడుపులపాయ గెస్ట్ హౌస్ లోనే బస చేయనున్న సీఎం జగన్ ఎల్లుండి క్రిస్మస్ సందర్భంగా పులివెందుల సిఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆపై అదేరోజు మధ్యాహ్నం కడప నుండి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.












Click it and Unblock the Notifications