ఇది సరైన పద్దతి కాదు -ఆ ఛాన్స్ ఇవ్వద్దు: మంత్రులకు తేల్చి చెప్పిన సీఎం జగన్ ..!!

ఎన్నికల దిశగా కసరత్తు ప్రారంభించిన సీఎం జగన్ మంత్రులకు హితబోధ చేసారు. ప్రతిపక్షాలు పనికట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నాయని..అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం స్పష్టం చేసారు. అవీనీతికి ఎక్కడా ఆస్కారం లేకుండా ప్రజలతో మమేకం అవ్వాలని సూచించారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. మంత్రులపైన ఆరోపణలు వస్తే ప్రభుత్వానికి చేటు చేస్తాయన్నారు. ఇన్ ఛార్జ్ మంత్రులు మొక్కుబడిగా ఉంటున్నారని..ఇది సరైన పద్దతి కాదని సీఎం హెచ్చరించారు.

ఎన్నికలు వస్తున్నాయి..అప్రమత్తంగా ఉండాలి

ఎన్నికలు వస్తున్నాయి..అప్రమత్తంగా ఉండాలి

మరో 13-16 నెలల్లో ఎన్నికలు వస్తున్న వేళ..మంత్రులంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ నిర్దేశించారు. మంత్రులంతా అవినీతికి దూరంగా ఉండాలని సూచించారు. మంత్రులు అవినీతికి పాత్పుడుతున్నట్లుగా పనికట్టుకొని దుష్ప్రచారం చేస్తన్నాయని..ప్రతిపక్షాల విమర్శలు తిప్పి కొట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎలాంటి ఆరోపణలకు ఆస్కారం ఇవ్వద్దని స్పష్టం చేసారు.

ఎన్నికలు దగ్గర పడీ కొద్దీ ప్రతిపక్షాల ఆరోపణలు..మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంటుందన్నారు. మంత్రుల పైన ఆరోపణలు వస్తే ప్రభుత్వంపైన ప్రభావం పడుతుందన్నారు. అటువంటి ఛాన్స్ ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వం పధకాలను పారదర్శకంగా అమలు చేస్తోందని.. మంత్రులంతా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. పథకాలు ఇంత పెద్ద మొత్తంలో అమలు చేస్తున్న సమయంలో ఎక్కడా లోపాలు లేకుండా జాగ్రత్తంగా వ్యవహరించాలని నిర్దేశంచారు.

ఇంఛార్జ్ మంత్రులకు కీలక సూచనలు

ఇంఛార్జ్ మంత్రులకు కీలక సూచనలు

మంత్రివర్గ సమావేశంలో అధికారిక అజెండా పూర్తయిన తరువాత కొద్ది సేపు మంత్రులతో సీఎం జగన్ పలు అంశాలపై చర్చించారు. ప్రత్యేకించి ఇంఛార్జ్ మంత్రుల పని తీరుపైన పలు సూచనలు చేసారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ఇంఛార్జ్ గా ఉన్న జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా పరిశీలించాలని సూచించారు.

మొక్కువగా వ్యవహరించటం సరైన పద్దతి కాదని హెచ్చరించారు. జిల్లాల్లో నియోజకవర్గాల్లో ఎక్కడైనా నేతల మధ్య వివాదాలు ఉంటే సర్దుబాటు చేయాలని సూచించారు. సొంత నియోజకవర్గాల్లోనూ తిరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసారు. జనవరి 1వ తేదీ నుంచి ఇచ్చిన హామీ విధంగా పెన్షన్ ను పెంచి అందిస్తున్నామని..అందులో మంత్రులు స్వయంగా పెన్షన్లు అందించే కార్యక్రమంలో పాల్గొనాలని నిర్దేశించారు.

విద్యార్ధులకు డిసెంబర్ 21న అదించే టాబ్ ల పంపిణీలోనూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం పైన 16న వర్క్ షాప్ నిర్వహణకు నిర్ణయించారు.

చేసిన పనులు చెప్పుకోలేకపోతున్నాం

చేసిన పనులు చెప్పుకోలేకపోతున్నాం

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం..పేదలకు మంచి గురించి మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 87 మందికి సంక్షేమం అందుతోందన్నారు. ఇంత భారీ స్థాయిలో మేలు చేస్తున్నా చేసిన పనులు ఆశించిన స్థాయిలో చెప్పుకోలేకపోతన్నామని వ్యాఖ్యానించినట్లు సమాచారం.

ఇందుకు మంత్రులు చొరవ తీసుకోవాలని సీఎం నిర్దేశించారు. మంత్రులు ఇటు పాలనా వ్యవహారాలతో పాటుగా పార్టీ కార్యక్రమాలపైన ఎక్కువగా సమయం కేటాయించాని సీఎం నిర్దేశించారు. పథకాల గురించి ప్రతీ గ్రామంలోనూ చర్చ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇంఛార్జ్ మంత్రులు ఖచ్చితంగా తమకు కేటాయించిన జిల్లాల్లో ప్రతీ నెలా పర్యటించి అక్కడి కార్యక్రమాల పైన ఫోకస్ పెట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+