Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అంతు చూస్తారట, నిద్ర పట్టటం లేదు - చంద్రబాబు, పవన్ కు సీఎం జగన్ చురకలు..!!

ముఖ్యమంత్రి జగన్ మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు పై మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పైనా కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ మూడు సభల్లో చేస్తున్న వ్యాఖ్యలను జగన్ ప్రస్తావించారు. తన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో వారికి ఫ్యూజలు ఎగిరిపోయాయన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీం అయినా గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు. పవన్ తాను సీఎం కాకుండా, చంద్రబాబు ను సీఎం చేయటానికి తపన పడుతున్నారని ఎద్దేవా చేసారు.

నిధులు విడుదల చేసిన సీఎం : ముఖ్యమంత్రి జగన్ నాలుగో విడత వైయ‌స్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో వడ్డీ డబ్బును జమ చేసారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్‌ చేస్తూ అమలాపురంలో వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ అయ్యేలా నిధులు విడుదల చేసారు. బహిరంగ సభలో ప్రతిపక్షాల పైన సీఎం జగన్ విరుచుకుపడ్డారు. ఈ నాలుగేళ్ల కాలంలో 2.31 లక్షల కోట్ల మేర ప్రజలకు మేలు అందించామని సీఎం వెల్లడించారు. మహిళా పక్షపాత ప్రభుత్వంగా తొలి నుంచి నిర్ణయాలు అమలు చేస్తున్నామని వివరించారు. పేదలకు రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామని చెప్పుకొచ్చారు.

CM Jagan made serious comments against Chandra Babu, Releases Zero interest for DWACRA Groups

అంతు తేల్చుతాం అంటున్నారు : చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఇలా మంచి చేసారా అని ప్రశ్నించారు. పేదలకు ఇంటి స్థలాలు ఇస్తామంటే అడ్డుకునే చరిత్ర చంద్రబాబు సొంతమని సీఎం జగన్ ఆరోపించారు. ఇలాంటి వ్యక్తిని సీఎం చేయటానికి దత్తపుత్రుడు ఆరాట పడుతున్నారని ఎద్దేవా చేసారు. దత్తపుత్రుడు సీఎం కావాటానికి కాదు, చంద్రబాబును సీఎం చేయటానికి అంటూ చురకలు అంటించారు. తమకు అధికారం ఇస్తే ఎవరినీ వదలడు..ఉగ్రరూపం చూపిస్తాడట.. అంతు తేల్చుతాం.. గిట్టని వారిని మట్టుబెడతారట అంటూ సీఎం చంద్రబాబు, పవన్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఇందుకోసం ఆయనకు అధికారం ఇవ్వాలని కోరుతున్నారని వివరించారు. దళితులకు నరకం చూపించారి... బీసీల తోకలు కత్తిరిస్తానని బెదిరించారని సీఎం జగన్ గుర్తు చేసారు. మైనార్టీ, ఎస్టీలకు చంద్రబాబు ఏ మాత్రం మేలు చేయలేదన్నారు.

మంచి జరిగితే అండగా నిలవండి : అదే బడ్జెట్ అదే రాష్ట్రం అప్పుడు ఎందుకు ఈ పథకాలు అమలు కాలేదని సీఎం ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. వెళ్లాల్సిన దారి మళ్లించి పుంగనూరులో పోలీసులపై దాడి చేసేలా చంద్రబాబు రెచ్చగొట్టారని చెప్పారు. ఈ కారణంగా 47 మంది పోలీసులు గాయపడ్డారని, ఒకరు కంటి చూపు కోల్పోయారని చెప్పుకొచ్చారు. ఇలాంటి వారికి సెక్యురిటీ అవసరమా అనిపిస్తోందన్నారు. మంచి చేయటం కోసం వాలంటీర్లు మీ దగ్గరికి వస్తున్నారని..అటువంటి వాలంటీర్లను వదలకుండా దారుణంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. నీచమైన రాజకీయాల్లో రాబోయే రోజుల్లో ఎక్కువ అవుతాయని హెచ్చరించారు. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది ఆలోచన చేయాలని..మీరే సైనికులుగా తోడుగా నిలబడాలని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+