Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాలినేని సీటు మార్పు, టీడీపీ సీట్లలో కొత్త లెక్కలు - జగన్ మార్క్ మార్పులు..!!

ముఖ్యమంత్రి ఎన్నికలకు కొత్త లెక్కలతో బరిలోకి దిగుతున్నారు. గెలుపే ప్రామాణికంగా..సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. టీడీపీ బలం పెరిగిందని భావిస్తున్న సీట్లలో అనూహ్య మార్పులు చేస్తున్నారు. ఇప్పటి వరకు 38 ఇంఛార్జ్ ల మార్పులను పార్టీ అధికారికంగా ప్రకటించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలోనూ మార్పుల పైన కసరత్తు తుది దశకు చేరుకుంది. అందులో భాగంగా కొత్త అంచనాలు తెర మీదకు వస్తున్నాయి.

అనూహ్య నిర్ణయాలతో: ముఖ్యమంత్రి జగన్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో 2019 ఎన్నికల్లో టీడీపీ నాలుగు స్థానాలకే పరిమితం అయింది. ఈ సారి టీడీపీ, జనసేన పొత్తు తో సీఎం జగన్ సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రకాశం పైన సుదీర్ఘంగా కసరత్తు జరుగుతోంది. తొలి విడత జాబితాలోనే మంత్రులు సురేష్, నాగార్జునలకు ప్రకాశంలో సీట్లు ఖరారు చేసారు.

CM Jagan mark change Inchares in Prakaam and Nellore districts, Balineni to field from Giddalur

ఇక, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం లేదని ప్రకటించారు. ఒంగోలు తో సహా మిగిలిన నియోజకవర్గాల్లో మార్పుల పైన పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త విజయ సాయిరెడ్డి జిల్లాకు చెందిన నేతలు బాలినేని, మాగుంటతో సహా పలువురితో సుదీర్ఘ మంతనాలు జరిపారు. చివరకు అందరిని మార్పులకు ఒప్పించినట్లు తెలుస్తోంది.

మార్పులు - చేర్పులు: ఒంగోలు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని గిద్దలూరు నుంచి రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీని పైన బాలినేనితో చర్చలు జరుగుతున్నాయి. బాలినేని అందుకు అంగీకరిస్తే ఒంగోలు నుంచి సిద్దా రాఘవరావు కుమారుడు సుధీర్ బరిలో నిలిచే అవకాశం ఉంది. ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని కనిగిరి నుంచి పోటీ చేయించే విధంగా కసరత్తు జరుగుతోంది.

ఒంగోలు ఎంపీగా బీసీ వర్గానికి కేటాయించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా బుర్రా మధుసూధన్ పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు నెల్లూరులోనూ అభ్యర్దుల ఖరారు పైన విజయ సాయిరెడ్డి ప్రాధమిక కసరత్తు పూర్తి చేసారు. జగన్ వద్ద నేడు ఈ జిల్లాకు సంబంధించి నిర్ణయాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

CM Jagan mark change Inchares in Prakaam and Nellore districts, Balineni to field from Giddalur

కొత్త సమీకరణాలు: నెల్లూరు ఎంపీగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేయటం దాదాపు ఖాయమైంది. ఆయన నెల్లూరు పార్లమెంట్ పరిధిలో మూడు సీట్ల మార్పు పైన సూచనలు చేసారు. దీని పైన నేరుగా సీఎం జగన్ తోనే చర్చలు చేసారు. నెల్లూరు జిల్లాలో గూడూరు అభ్యర్ది ఎమ్మెల్యే వరప్రసాద్ కు ఎమ్మెల్సీ హమీ ఇచ్చి..ఆ స్థానం నుంచి ఒక మాజీ అధికారిని బరిలోకి దింపాలనేది ఆలోచనగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ మేరుగ మురళికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ ఉంది.

నెల్లూరు సిటీ టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో..సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ కు తిరిగి వైసీపీ సీటు ఖరారైంది. ఈ రోజు లేదా రేపు ప్రకాశం, నెల్లూరు జిల్లాల అభ్యర్దుల జాబితా ప్రకటించే ఛాన్స్ ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+