సీఎం జగన్ మార్క్ లెక్కలు - ఆ వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు : కేబినెట్ లో కొత్త ఈక్వేషన్లు..!!
సీఎం జగన్ కొత్త సమీకరణాలతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ-ఎస్టీ-బీసీ- మైనార్టీ - కాపు సమీకరణానికి ప్రాధాన్యత ఇచ్చిన జగన్.. ఈ సారి వీరితో పాటుగా అగ్రవర్ణాలకు సైతం ప్రయార్టీ ఇచ్చి వారికి దగ్గరవ్వాలని భావిస్తున్నారు. ఏపీలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి సమయం నిర్ణయించారు. ఇప్పటికే కేబినెట్ మంత్రులను తప్పించటం .. కొత్త మంత్రులకు అవకాశం గురించి అనేక సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా..సీఎం జగన్ మరో ఆసక్తి కర నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

డిప్యూటీ సీఎంల ఎంపికలో కొత్త సమీకరణం
2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత సీఎం జగన్ తన కేబినెట్ కూర్పుతో అందరిని ఆశ్చర్య పరిచారు. పక్కాగా సామాజిక - ప్రాంతీయ సమీకరణాలతో కూర్పు పూర్తి చేసారు. అదే సమయంలో సీనియర్లను సైతం పక్కన పెట్టి.. సామాజిక సమీకరణాలకే ప్రాధాన్యత ఇచ్చారు. అందులోనూ అయిదు వర్గాలకు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చి..అందరినీ ఆశ్చర్య పరిచారు. గతంలో చంద్రబాబు హాయంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండేవారు. అందులో ఒకటి బీసీలకు ఇవ్వగా .. మరొకటి కాపు వర్గానికి కేటాయించారు. జగన్ సీఎం అయిత తరువాత తన కేబినెట్ లో ఎస్సీ-ఎస్టీ-బీసీ-మైనార్టీ- కాపు వర్గాలకు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. ఇక, ఇప్పుడు మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా డిప్యూటీ సీఎం పదవులు ఆరుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఆ వర్గాలకు సైతం ప్రాధాన్యత ఇచ్చేలా
ఇప్పుడున్న వర్గాలకు కొనసాగిస్తూనే మరో డిప్యూటీ సీఎం పదవి..అవసరమైతే రెండు వరకు పెంచే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నేతల సమాచారం. ఈ సారి విస్తరణలో భాగంగా.. ఎస్సీ- ఎస్టీ- మైనార్టీ - కాపు వర్గాలకు డిప్యూటీ సీఎం హోదా కొనసాగనుంది. ఇక, బీసీల్లో తొలుత జగన్ శెట్టి బలిజ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ కు డిప్యూటీ హోదా కల్పించారు. ఆయన రాజ్యసభకు వెళ్లటంతో..ఆ హోదాను ఉత్తరాంధ్ర- శ్రీకాకుళంకు చెందిన ధర్మాన క్రిష్ణదాస్ కు ఇచ్చారు. ఈ సారి బీసీ వర్గాల్లో మత్య్సకార వర్గానికి డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ పేరు ప్రచారంలో ఉంది. జగన్ తొలి కేబినెట్ లో మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవి వెంకట రమణ 2019 ఎన్నికల్లో ఓడినా.. మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీగా నామినేట్ చేసారు. ఆ తరువాత మోపిదేవిని రాజ్యసభకు పంపారు.

ఆ మూడు వర్గాలకు ఖాయమంటూ ప్రచారం
ఆ స్థానంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సిదిరి అప్పలరాజు ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.ఇప్పుడు జిల్లాల సమీకరణాల్లో భాగంగా అప్పలరాజును తప్పిస్తే.. అదే వర్గానికి చెందిన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ పేరు వినిపిస్తోంది. అదే విధంగా ఈ సారి వైశ్య లేదా బ్రాహ్మణ సామాజిక వర్గాలకు సైతం డిప్యూటీ సీఎం హోదా ఇవ్వటం ద్వారా ఆ వర్గాల్లోనూ సానుకూలత వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం వైశ్య సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లిని మార్చితే..ఆ స్థానంలో కొలగొట్ల వీరభద్ర స్వామి లేదా అన్నా రాంబాబు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అదే విధంగా బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి మల్లాది విష్ణు - కోన రఘుపతిలో ఒకరికి అవకాశం ఉందని చెబుతున్నారు.

సామాజిక సమీకరణాల్లో జగన్ మార్క్ నిర్ణయాలు
గతంలోనే కోన రఘుపతికి మంత్రి పదవి కేటాయింపు పైన సీఎం జగన్ హామీ ఇచ్చారు. దీంతో..ఇప్పుడు క్రిష్ణా - గుంటూరు జిల్లా సమీకరణాల్లో భాగంగా ఈ ఇద్దరి పేర్లు సైతం పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏ వర్గానికి దూరం కాకుండా ...2024 ఎన్నికలే లక్ష్యంగా సీఎం జగన్ ఈ కొత్త సమీకరణాల తో డిప్యూటీ సీఎం పదవుల పైన కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సారి కేబినెట్ లో బ్రాహ్మణ, వైశ్య, మత్స్యకార వర్గాలకు ప్రాధాన్యత దక్కనున్నట్లు తెలుస్తోంది. దీంతో..జగన్ మార్క్ లెక్కలు - ప్రక్షాళనతో వైసీపీ ఆశావాహుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications