రైతులకు సీఎం జగన్ మార్క్ సంక్షేమం.. వారికి ఊరటగా ఈరోజే అంకౌట్లలోకి డబ్బులు!!
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో రైతులకు మూడో విడత రైతు భరోసా జమ చేసిన వైయస్ జగన్, ఏపీ రైతులకు ఈ క్రమంలో ఈరోజు మళ్లీ రైతుల ఖాతాలలోకి బటన్ నొక్కి నగదు జమ చేయనున్నారు. మిచాంగ్ తుఫాన్ తో తీవ్ర వర్షాల కారణంగా, తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 2023- 24 ఖరీఫ్, రబీ సీజన్లలో పంట నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారాన్ని అందించనున్నారు సీఎం జగన్.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు. ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన 11.59 లక్షల మంది రైతులకు 1 294. 58 కోట్ల రూపాయలను నేడు రైతుల ఖాతాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి జమ చేయనున్నారు. తద్వారా బాధిత రైతులకు నేరుగా పంట నష్టపరిహారాన్ని అందించనున్నారు.

ఇప్పటికే ఏపీలో రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్న జగన్ వైయస్సార్ రైతు భరోసా తో పాటు 0 వడ్డీ రాయితీ కింద 1294.34 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేశారు. ఇక నేడు మళ్లీ అన్నదాతలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన జగన్ సర్కార్ ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతాంగానికి అండగా నిలవనున్నారు.
కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఆరు ప్రామాణికాలను తీసుకొని నష్ట పరిహారం అందించే ప్రక్రియలో భాగంగా రైతుల పంట వివరాలను సేకరించిన సీఎం జగన్, క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత మొత్తం 11, 59,126 మంది రైతులకు 20,93,377 ఎకరాలలో పంట నష్టం జరిగిందని, వీరందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించి నేరుగా వారి ఖాతాలకు పంట నష్టపరిహారాన్ని జమ చేయనున్నారు.












Click it and Unblock the Notifications