వైఎస్ విజయమ్మ కారుకు పెను ప్రమాదం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి విజయమ్మకు పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమదానికి గురైంది. అయితే ఈ ప్రమాదం నుంచి ఆమె క్షేమంగా బయటపడ్డారు. వైఎస్ విజయమ్మ శుక్రవారం ఉదయం ఓ కార్యక్రమం కోసం హైదరాబాద్ నుంచి ఒంగొలు బయలుదేరి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంతమంగలూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో..ఆమె కాన్వాయ్‌లోని మరో కారు వెనుక నుంచి వైఎస్ విజయమ్మ ఉన్న వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో విజయమ్మ కారు వెనుక భాగం పూర్తిగా దెబ్బతింది. అయితే కారులో ఉన్న విజయమ్మకు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక వైఎస్ విజయమ్మ వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది.

కూతురు షర్మిల స్థాపించిన వైఎస్ఆర్‌టీపీ నుంచి విజయమ్మ పోటీ చేయానున్నారని ప్రచారం జరుగుతుంది. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి కూడా రెడీ అయ్యారు.కాని అనుహ్యంగా షర్మిల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వెనకడుగు వేయడంతో.. వైఎస్ఆర్‌టీపీ నుంచి షర్మిల, తల్లి విజయమ్మ పోటీ చేయడానికి సన్నద్దం అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయనుండగా, విజయమ్మ పోటీ చేయబోయే స్థానంపై క్లారిటీ రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications