Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేపు నంద్యాలకు సీఎం జగన్ - అక్కడే తొలి ప్రకటన : ఇక గడపగడపకు - ప్రజల్లోనే..!!

టార్గెట్ 2024 గా అడుగులు వేస్తున్న సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక, వీలైనంత వరకు ప్రజలతోనే ఉండాలని నిర్ణయించారు అందులో భాగంగా గడపగడపకు ఎమ్మెల్యే కార్యక్రమం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి జగన్ రేపు (8వ తేదీ) నంద్యాల లో పర్యటించనున్నారు. జగనన్న వసతి దీవెన కింద తదుపరి విడతను నంద్యాలలో జరిగే బహిరంగ సభలో సీఎం విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా వరసగా నవ రత్నాలను సీఎం అమలు చేస్తూ వచ్చారు. అయితే, ఈ సారి నంద్యాలో ఈ కార్యక్రమం నిర్వహణకు నిర్ణయించారు. జిల్లా ప్రతినిధులతో పాటుగా.. విద్యార్ధులను సైతం ఈ కార్యక్రమంలో హాజరయ్యేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

నంద్యాలలోనే తొలి ప్రకటన

నంద్యాలలోనే తొలి ప్రకటన

కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత సీఎం జగన్ తొలి సారి జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. వైసీపీ ప్రతిపక్షం లో ఉన్న సమయంలో జగన్ నాడు ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మారుస్తామంటూ నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనే తొలి సారిగా ప్రకటన చేసారు. ఆ తరువాత 2019 ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చేర్చారు. ఇప్పుడు అమలు చేసారు. దీంతో..జిల్లాలు ఏర్పాటు చేసిన తరువాత నంద్యాల నుంచే పర్యటనలు ప్రారంభిస్తున్నారు. ఇక, కేబినెట్ ప్రక్షాళన సమయంలో ఎవరికి మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందనే అంచనాల నడుమ..సీఎం నంద్యాల పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. 2024 ఎన్నికలకు పార్టీ పరంగా సిద్దం అయ్యే క్రమంలో భాగంగా.. వైసీపీ కొత్త కార్యక్రమాలు మొదలు పెడుతోంది.

గడపగడపకు ఎమ్మెల్యే

గడపగడపకు ఎమ్మెల్యే


గడపగడపకు ఎమ్మెల్యే కార్యక్రమం మే లో ప్రారంభించాలని నిర్ణయించారు. ప్లీనరీ తర్వాత పార్టీ కార్యక్రమాలు బాగా పెరుగుతాయని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సచివాలయాల పరిధిలో సూక్ష్మస్థాయి పరిశీలన ద్వారా పార్టీ శ్రేణుల పనితీరు, అసంతృప్తులు, గ్యాప్‌ ఎక్కడ ఉంది, వాటిని ఏ విధంగా సరిదిద్దుకుని ముందుకెళ్లాలనే అంశాలపై పూర్తి అవగాహన రావచ్చన్నారు. ఈ అంశం పైన ఆయన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. వాలంటీర్లను సత్కార కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు పైన ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు, మునిసిపల్‌ చైర్మన్లతో సమన్వయం చేసుకుని ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో షెడ్యూల్ రూపొందించుకోవాలని సజ్జల సూచించారు.

Recommended Video

    AP New Districts: 42 ఏళ్ల తరువాత ఒకే సారి 13 జిల్లాల ఏర్పాటు | 26 Districts in AP | Oneindia Telugu
    జిల్లాల పర్యటనలకు సీఎం జగన్

    జిల్లాల పర్యటనలకు సీఎం జగన్

    ఇక నుంచి ప్రతి కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల పరిధిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నామినేటెడ్‌ పదవులు పొందినవారు, పార్టీ నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని స్పష్టం చేసారు. ఇందుకు ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జీలు బాధ్యతలు తీసుకోవాలన్నారు. బూత్‌ కమిటీలపై పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు 20 రోజుల్లో సమాచారం పంపాలని ఆయన కోరారు. కొత్త కేబినెట్ ఏర్పాటు.. ప్రస్తుత మంత్రులకు పార్టీ బాధ్యతలు..రీజనల్ కో ఆర్డినేటర్ల నియామకం తరువాత సీఎం జగన్ సైతం జిల్లాల్లో పర్యటనలకు సిద్దం అవుతున్నారు. దీని ద్వారా.. పధకాల నిర్వహణ పైన క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకం కావాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి నేటి కేబినెట్ లో సీఎం జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+