ఆ పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్.., వాటన్నింటికీ ఒకే కాల్ సెంటర్,నంబర్ ఉండాలని ఆదేశం...
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వెటర్నరీ వైద్యుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం రైతు భరోసా కేంద్రాల్లో కూడా వెటర్నరీ వైద్యులు సేవలు అందించాలన్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పశు సంవవర్ధక, పాడి పరిశ్రమ భివృద్ధి, మత్స్యశాఖలపై సీఎం జగన్ సోమవారం(మార్చి 22) తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో సమీక్ష నిర్వహించారు.
రైతు భరోసా కేంద్రాల్లో కియోస్క్ ద్వారా పశు దాణా, మందుల పంపిణీ. సీడ్, ఫీడ్, మెడికేషన్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీలకు అడ్డుకట్ట వేయాలన్నారు. గ్యారంటీ, టెస్టెడ్, క్వాలిటీ ముద్రలతో ప్రభుత్వం విత్తనాలు ఇస్తోందని... కాబట్టి నాణ్యత విషయంలో ఎక్కడా తేడా రావొద్దని అన్నారు.

వైఎస్సార్ పశునష్ట పరిహార పథకం ఆర్బీకేల్లో డిస్‌ప్లే చేయాలని ఆదేశించారు. ప్రతీ మూడు నెలలకోసారి పంట భీమా పరిహారం క్లెయిమ్స్ క్లియర్ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకోసం రూ.98కోట్లు బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.రైతు భరోసా కేంద్రాల్లోని కాల్ సెంటర్ నంబర్ 155251 పనిచేస్తోందా లేదా అన్నది ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్... వీటన్నింటికీ ఒకే కాల్ సెంటర్, ఒకే నంబర్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో పశు సంవర్ధక శాఖకు చెందిన అసిస్టెంట్స్ ఖాళీలను కూడా భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. బయో ఫెస్టిసైడ్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని... నాణ్యత విషయంలో రాజీపడవద్దని సూచించారు.జగనన్న పాలవెల్లువ, జగనన్న జీవక్రాంతి పథకాల ద్వారా పశువులు, గొర్రెలు, మేకల పంపిణీపై కూడా సమీక్ష నిర్వహించారు.ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ ల్యాబ్స్ ఏర్పాటుకు జూన్ 1, 2021 నాటికి భవనాలన్నీ సిద్ధం కావాలని ఆదేశించారు. కొత్తగా 21 లాబ్ టెక్నిషియన్స్, 21 లాబ్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications