సంప్రదాయ దుస్తులో సీఎం జగన్ - వేడుకల్లో సతీ సమేతంగా : సింగర్ మంగ్లీ సైతం..!!
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. అందులో సీఎం జగన్ దంపతులు పొల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో వేడుకలకు హాజరైన సీఎం తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్నారులతో సీఎం జగన్ సరదాగా కాసేపు ముచ్చటించారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..ప్రతి ఇంట ఆనందాలు వెల్లి విరియాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
సంప్రదాయ పంచెకట్టుతో గోశాలకు చేరుకున్న సీఎం వైయస్ జగన్.. గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డోలు వాయిద్య కళాకారుల విన్యాసాలు, మహిళల కోలాటాలు, యువతుల నృత్యాలను సీఎం దంపతులు తిలకించారు.
ముఖ్యమంత్రి నివాసంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు. హాజరైన సీఎం శ్రీ వైయస్ జగన్ దంపతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు. #Sankranthi2022 pic.twitter.com/pzX7jQ8sgn
— YSR Congress Party (@YSRCParty) January 14, 2022

హరిదాసుకు ధాన్యాన్ని, కానుకలను అందించారు. చిన్నారులతో ఫొటోలు దిగారు. ఈ వేడుకల్లో పాల్గొన్న సింగర్ మంగ్లీ, ఆమె సోదరి సీఎం జగన్‌ను కలిశారు. ఈ మధ్య కాలంలోనే సీఎం నివాసం ప్రాంగణంలో గోశాల ఏర్పాటు చేసారు. సీఎం సతీమణి భారతి సూచనల మేరకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి గోవులను తెప్పించారు. భోగి నాడు సీఎం దంపతులు ఆ గోవులకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ఎమ్మెల్యే చెవిరెడ్డి పార్టీ నేతలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications