విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసు అమరవీరుల దినోత్సవంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!

|
Google Oneindia TeluguNews

మనందరి సైనికులే పోలీసులు అంటూ పోలీసుల సేవలకు సీఎం జగన్ సెల్యూట్ చేసారు. పోలీసు అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్ కీలక ప్రసంగం చేసారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తన మనసులో నిలిచిపోయిన పోలీసులకు వీక్లాఫ్ అంశం పైన తాను డీజీపీతో చర్చించానని చెప్పారు. సిబ్బంది కొరత కారణంగా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నామని డీజీపీ చెప్పటంతో..ఇప్పటికే 6511 పోలీసు సిబ్బంది నియామకానికి అనుమతులు ఇచ్చామన్నారు.

వార్డు - గ్రామ సచివాయాల ద్వారా 16 వేల మంది మహిళా పోలీసులను నియమించామని సీఎం వివరించారు. పోలీస్ ఉద్యోగాల్లోహోం గార్డ్ లకి రిజర్వేషన్ అమలు చేస్తామని వెల్లడించారు. హోం గార్డుల గౌరవం వేతనం ఈ ప్రభుత్వంలోనే పెంచిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేసారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా దిశా వ్యవస్థ అందుబాటులోకి తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో 1.33 కోట్ల మంది దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారని చెప్పారు. గతం ప్రభుత్వ హయాంలో మహిళలపైన నేరాల విచారణ సమయం 164 రోజులుగా ఉండేదని..ఈ ఏడాది ఈ ప్రభుత్వ హయాంలో అది 42 రోజులకు తగ్గిందదని సీఎం వెల్లడించారు.

CM Jagan pays rich tributes to police martyrs on Police Commemoration Day at Vijayawada

42 రోజుల సమయంలోనే మహిళల పైన నేరాలకు సంబంధించి దోషులను కోర్టుల ముందు ఉంచుతున్నామని వివరించారు. మహిళలు పిల్లలు..అణగారిన సామాజిక వర్గాల భద్రతలో రాజీ పడద్దని సీఎం పోలీసులకు సూచించారు. ఏపీలో తమ ప్రభుత్వం ఏర్పాటు అయిన సమయం నుంది దళిల మహిళళే హోం మంత్రులుగా ఉన్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మావోయిజం..తీవ్రవాదం ఉన్న ప్రాంతాల్లో ప్రభావం తగ్గిందని సీఎం జగన్ చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం ద్వారా మనసులను గెలిచి శాంతిని భద్రతను పెంచుకోగలిగామన్నారు. ఇంకా పోలీసులకు చేయాల్సినవి ఉన్నాయని..ఆ దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం వివరించారు.

English summary
CM JAgan participated in Police Commemoration Day at Vijayawada, pays rich tributes to police martyrs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X