• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్ ఎలక్షన్ టీం - పదవుల నుంచి ఆ నేతలు అవుట్ : కొత్తగా దక్కిందెవరికి..!!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికలకు తన టీం సిద్దం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. క్షేత్ర స్థాయిలో పార్టీ జిల్లా అధ్యక్షుల నుంచి ప్రాంతీయ సమన్వయకర్తల వరకు మార్పులు జరిగాయి. సీనియర్లు - ముఖ్యులు అన్న తేడా లేకుండా పని తీరే కొలమానంగా తన టీంలో సీఎం జగన్ మార్పులు చేసారు. సజ్జల..కొడాలి నాని..అనిల్ వంటి వారిని రీజనల్ కో ఆర్డినేటర్ల బాధ్యతల నుంచి తప్పించిన సీఎం జగన్.. ఎనిమిది జిల్లాల అధ్యక్షులను మార్చారు. ఇందులో కొందరు తమను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని కోరగా.. మరి కొందరిని పార్టీ అధినాయకత్వం మార్చింది.

CM Jagan preparing his Election team, Changed Party District presidents, new list is here

జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు మార్పులు

ఎన్నికలకు సిద్దం అవుతున్న ముఖ్యమంత్రి ఇందు కోసం తన టీంలో మార్పులు చేసారు. ఎనిమిది మంది జిల్లా అధ్యక్షులను..ఆరుగురు ప్రాంతీయ సమన్వయ కర్తలను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. జగన్ తన తొలి కేబినెట్ లో ఉన్నవారిని తప్పించి వారికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు కేటాయించారు. ఇప్పుడు వారిలోనూ కొందరిని మార్చారు. కొద్ది రోజులుగా వైసీపీలో వరుసగా కొందరు జిల్లా అధ్యక్ష పదవుల నుంచి తప్పుకొనేందుకు ముందుకు వచ్చారు. కొత్త వారిని నియమించేందుకు రూట్ క్లియర్ చేసారు. అయిదుగురు జిల్లాల అధ్యక్షుడు తమకు ఆ బాధ్యతల నుంచి తప్పించాలని కోరారు. మిగిలిన ముగ్గురిని పని తీరు ఆధారంగా పార్టీ తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో రాజకీయంగా వైసీపీకి కీలకంగా ఉన్న జిల్లాలు ఉన్నాయి.

CM Jagan preparing his Election team, Changed Party District presidents, new list is here

మాజీ మంత్రలకు షాక్.. కొత్త అధ్యక్షులు

అమరావతి ప్రాంత పరిధిలోని గుంటూరు జిల్లాకు ఇప్పటి వరకు పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న మాజీ హోం మంత్రి సుచరిత స్థానంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ కు బాధ్యతలు కేటాయించారు. కుప్పం వైసీపీ అభ్యర్ధిగా ఖరారైన భరత్ ను చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. ఆయనను పూర్తిగా నియోజకవర్గం పైనే ఫోకస్ చేయాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లా బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి అప్పగించారు. కేబినెట్ విస్తరణలో పదవులు కోల్పోయిన అవంతి శ్రీనివాస్, పుష్ప శ్రీవాణి, సుచరిత ఇప్పుడు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కీలకమైన విశాఖ జిల్లా బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు అప్పగించారు. అదే విధంగా పార్వీపురం మన్యం జిల్లా బాధ్యతలను మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ఫ శ్రీవాణి భర్త పరీక్షిత్ రాజుకు కేటాయించారు.

CM Jagan preparing his Election team, Changed Party District presidents, new list is here

కీలక జిల్లాలకు వైసీపీ అధ్యక్షుల్లో మార్పులు

ప్రకాశం జిల్లా అధ్యక్ష బాధ్యతలను బుర్రా మధుసూధన యాదవ్ నుంచి తప్పించి మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డికి కట్టబెట్టారు. కర్నూలు జిల్లా అధ్యక్ష పదవికి బాలనాగిరెడ్డి రాజీనామాతో ఆ పదవిని కర్నూలు మేయర్ బీవై రామయ్యకు అప్పగించారు.తిరుపతి జిల్లా అధ్యక్ష పదవి నుంచి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిని తప్పించి దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి తనయుడు రామ కుమార్ రెడ్డికి కేటాయించారు. రాజకీయంగా కీలకమైన అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలను పైలా నరసింహయ్య కు కేటాయిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో ప్రాంతీయ సమన్వయకర్తల బాధ్యతల విషయంలోనూ సీఎం జగన్ మార్క్ నిర్ణయం కనిపించింది. ఎన్నికల టీంగా చెప్పుకుంటున్న ఈ తాజా నియామకాల ద్వారా పని తీరే ప్రామాణికంగా నిర్ణయాలు ఉంటాయనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

English summary
CM Jagan Cahnged party President in Eight Districts, as a part of prepring team for up coming Elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X