లీడర్స్ గా ఎదగాలి, ఇది గొప్ప అవకాశం: ఆల్ ది బెస్ట్ - సీఎం జగన్..!!

పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడొద్దన్నారు. సివిల్స్ అభ్యర్థులకు జగనన్న ప్రోత్సాహకం అందిస్తున్నామన్నారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం.. మెయిన్స్‌ పాస్‌ అయితే రూ.లక్షా 50 వేలు అందిస్తున్నామని వెల్లడించారు. జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులను ముఖ్యమంత్రి జ‌గ‌న్ విడుదల చేశారు. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని సీఎం తెలిపారు. పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్‌ యూనివర్సిటీల్లో చదువుతున్నారని చెప్పారు.

ఏపీ విద్యార్థులు పోటీ ప్ర‌పంచంలో లీడ‌ర్స్‌గా ఎద‌గాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆకాంక్షించారు. రూ. 8లక్షల వార్షికాదాయం లోపు ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందిస్తున్నామని సీఎం వైయ‌స్ జగన్ పేర్కొన్నారు. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడొద్దన్నారు. సివిల్స్ అభ్యర్థులకు జగనన్న ప్రోత్సాహకం అందిస్తున్నామన్నారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం.. మెయిన్స్‌ పాస్‌ అయితే రూ.లక్షా 50 వేలు అందిస్తున్నామని వెల్లడించారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.60 కోట్లను విడుదల చేశారు. సివిల్స్‌లో క్వాలిఫై అయిన 95 మందికి విద్యా దీవెన కింద ప్రోత్సాహకాన్ని అందించారు.

CM Jagan Releases Funds under AP Videshi Vidya Deevena 2023-24

తల్లిదండ్రులు ఎలాంటి అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం, జగనన్న తోడుగా ఉంటుందన్న భరోసా ఈ కార్యక్రమం ద్వారా ఇస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. శాచురేషన్‌ పద్ధతిలో పారదర్శకంగా ఎవరికైనా కూడా టైమ్స్‌ రేటింగ్, టైమ్స్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్స్‌లో కానీ, క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ 50 కాలేజీల్లో 350 కాలేజీల్లో సీట్లు ఎవరికి వచ్చినా కూడా ఏపీ నుంచి ఎంటైర్‌ ఫీజు కోటి 25 లక్షల దాకా ఇచ్చి తోడుగా నిలబడిందన్నారు. ఈ పథకం ఎంత సంతృప్తి ఇస్తుందంటే..మిమ్మల్ని చూసి మిగిలిన వారు కూడా ఇన్‌స్ఫైర్‌ అయి టాప్‌ యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకునేలా నిలిచారని సీఎం వివరించారు. దాదాపుగా 107 కోట్లు 408 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

శాచురేషన్‌ పద్ధతిలో ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటున్నామని చెప్పారు. వార్షిక ఆదాయం రూ.8 లక్షలు ఉన్న కుటుంబాలకు ఈ పథకం దేవుడిచ్చిన గొప్ప అవకాశం. మీ అందరికీ కూడా ఆల్‌ దీ బెస్ట్‌ విసెస్‌ తెలియజేస్తూ..మీరందరూ అత్యధికంగా బాగుపడాలని కోరుకుంటున్నాను. ఎవరైనా ప్రిలీమ్స్‌ పాస్‌ అయితే వారికి లక్ష రూపాయల ప్రోత్సాహకం, ప్రిలీమ్స్‌ నుంచి మెయిన్స్‌కు ఎంపికైతే మరో రూ.50 వేలు కలిసి రూ.1.50 ఇస్తాం. ఎన్నిసార్లు పరీక్షలు రాసినా కూడా ఈ ప్రోత్సాహకం ఉంటుందని సీఎం స్పష్టం చేసారు. ఎవరికి రెకమెండేషన్లు అవసరం లేదు. ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. క్వాలిఫై అయి అప్లికేషన్‌ పెట్టుకుంటే మనందరి ప్రభుత్వంలో మంచి జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+