మహిళా లబ్దిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నిధుల జమ...!!

ఎన్నికల వేళ సీఎం జగన్ వ్యూహాత్మక నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేస్తున్న జగన్ సంక్షేమం - సామాజిక న్యాయం మరోసారి తనకు అధికారం అందిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. అందులో భాగంగా ఎన్నికలకు ముందు రెండు నెలల కాలంలో వైఎస్సార్ భరోసా, చేయతూ పథకాల అమలుకు ముహూర్తం నిర్ణయించారు. ఇదే సమయంలో పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్లు కట్టుకుంటున్న అక్కచెల్లెమ్మలకు పావలా వడ్డీకే రుణాలు విడుదల చేసారు.

పేదలందరికీ ఇళ్లు: ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు పథకం అమలు చేస్తోంది. ఇళ్లు కట్టుకుంటున్న లబ్దిదారులకు జగన్ ప్రభుత్వం పావలా వడ్డీకే రుణాలు అందజేస్తోంది. తొలి దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.46.90 కోట్లను గురువారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం వైయ‌స్‌ జగన్‌ బటన్‌ నొక్కి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశారు.

CM Jagan Releases Interest Reimbursement for beneficiaries of House or Poor at Tadepalli

ఈ సమయంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. మహిళా లబ్దిదారులపై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరుగుతుందని వివరించారు.

31.19 లక్షల మందికి లబ్ది: గతంలో 5.23 లక్షల మందికి ఈ కార్యక్రమం కింద రూ.54 కోట్లు ఇచ్చామన్నారు. ఈ రోజు 4.23 లక్షల మందికి రూ.47 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. పావలా వడ్డీకే ఇలా ఇస్తూ వాళ్ల ఇళ్ల నిర్మాణాల వేగవంతం చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ తరహాలో బహుశ దేశ చరిత్రలో ఎక్కడ జరగలేదన్నారు.

ఏకంగా 31.19 లక్షల ఇళ్లు అందిస్తున్నామని.. అందులో ఇప్పటికే 22.25 ల క్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. నిజంగా ఎక్కడా కూడా ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా జరుగుతుందని చెప్పారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షలు అవుతుంది. మరో లక్ష అధనంగా అవుతుందన్నారు. దాదాపుగా రూ.3.70 లక్షలు ఖర్చు అవుతుందని వివరించారు.

రూ 20 లక్షల వరకు ఆస్తి: రూ.1.85 లక్షలు నేరుగా ఇస్తున్నామని... మరో 35 వేలు పావలా వడ్డీకే ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఒకవైపు ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇచ్చిన ఒక్కో ఇంటి స్థలం విలువ ప్రాంతాన్ని బట్టి కనీసం రూ.2.50 లక్షలతో మొదలుపెడితే రూ.20 లక్షల దాకా ఉందన్నారు.

ఇవన్నీ కలిపి దాదాపుగా ప్రతి లబ్దిదారుకు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా ఒక ఆస్తిని రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఇచ్చేందుకు తనకు అవకాశం దక్కిందన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న అక్కచెల్లెమ్మలకు సక్రమంగా చెల్లించాలని సూచించారు. వాళ్లు కట్టిన వడ్డీ సొమ్మును తిరిగి వాళ్లకు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+