అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబును ఈ సారి ఓడిస్తే - సర్వే నివేదికలు ఇలా : కారణాలు- లక్ష్యాలు : సీఎం జగన్..!!

|
Google Oneindia TeluguNews

ఊహించిందే జరిగింది. ఏపీ మంత్రులు మూకుమ్మడిగా రాజీనామా చేసారు. కొద్ది సేపటి క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రారంభంలోనే ఖాళీ లెటర్ హెడ్ లను ప్రోటోకాల్ అధికారులకు ఇచ్చి అధికారులు ప్రొసీజర్స్ పూర్తి చేసారు. వాటి మీద మంత్రులు సంతకాలు చేసారు. దీంతీ..ఆ రాజీనామాలను సీఎం జగన్ ఆమోదిస్తూ..గవర్నర్ కు సిఫార్సు చేయనున్నారు. ఈ నెల 10వ తేదీన కొత్త మంత్రుల జాబితాను ప్రకటిస్తానని సీఎం కేబినెట్ సమావేశంలో వెల్లడించారు. 11వ తేదీన కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. అయితే, కేబినెట్ సమావేశంలో అధికారిక అజెండా పూర్తయిన తరువాత సీఎం జగన్ కేబినెట్ విస్తరణ గురించి ప్రస్తావించారు.

 2024 ఎన్నికలే లక్ష్యంగా...

2024 ఎన్నికలే లక్ష్యంగా...


అందరం వెయ్యి రోజులు కలిసి పని చేసాం.. అందరూ బాగా పని చేసారంటూ సీఎం మంత్రులను ప్రశంసించారు. వచ్చే ఎన్నికల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం 2024 ఎన్నికల లక్ష్యంగా ఉంటాయని సీఎం స్పష్టం చేసారు. వచ్చే ఎన్నికలు కీలకమని చెప్పారు. చంద్రబాబును మరోసారి ఓడిస్తే ఆయనకు..ఆయన పార్టీకి ఇక రాజీకయంగా భవిష్యత్ ఉండదని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో పాటుగా సర్వే నివేదికల పైన సీఎం ప్రస్తావన చేసారు. ముఖ్యమంత్రి సర్వేల్లో సీఎం పని తీరు బాగుందని...కొంత మంది ఎమ్మెల్యే లు ఓడిపోయే అవకాశం వుంది‌కనుక వారిని గెలిపించుకునే బాధ్యత మన అందరి‌పై వుందంటూ సీఎం వ్యాఖ్యానించారు.

సీనియర్లు బాధ్యత తీసుకోవాలంటూ..

సీనియర్లు బాధ్యత తీసుకోవాలంటూ..

చంద్రబాబు ఓడించే బాధ్యత సీనియర్లదేనని సీఎం స్పష్టం చేసారు. ప్రస్తుత మంత్రుల్లో కొందరిని సామాజిక సమీకరణాలతో పాటుగా.. కొత్త కేబినెట్ లో సీనియార్టీ సైతం అవసరం కావటంతో కొందరిని కొనసాగించే అవసరం ఉందని సీఎం చెప్పుకొచ్చారు. మంత్రుల రాజీనామాల గురించి మాట్లాడుతున్న సమయంలో సీఎం జగన్ కొంత ఆవేదనతో మాట్లాడుతుండగా..మంత్రులు తమకు ఎటువంటి బాధ్యతలు అప్పగించినా నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. అందరూ రాజీనామా లేఖలు ఇవ్వగానే హర్షధ్వానాలతో మరలా అధికారంలోకి వస్తామంటూ మంత్రులు ధీమా వ్యక్తం చేసారు. పార్టీ బాధ్యతలు తీసుకోవటానికి తమకు ఎటువంటి బాధ్యతలు లేవని తేల్చి చెప్పారు.

కొనసాగే వారి గురించి క్లారిటీ

కొనసాగే వారి గురించి క్లారిటీ


ఎవరి సేవలు ఎలా వినియోగించుకోవాలో తనకు తెలుసంటూ నే సీఎం జగన్..ఆ విధంగానే బాధ్యతలు అప్పగిస్తానని స్పష్టం చేసారు. ఇక, రాజకీయంగా వేగంగా అడుగులు వేసే అవసరం ఉందనే అభిప్రాయం సీఎం జగన్ మాటల్లో వ్యక్తం అయిందని మంత్రులు అభిప్రాయ పడుతున్నారు. అదే విధంగా సీఎం జగన్ సామాజిక సమీకరణాలో పాటుగా అనుభవం అంశాన్ని సైతం ప్రస్తావించటంతో ఆయన చెప్పినట్లుగా ప్రస్తుత మంత్రుల్లో ఎవరు కొనసాగుతారనే చర్చ ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
CM Jagan revealed survey details in cabinet meet, fixed target for resinged ministers for 2024 elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X