సీఎం జగన్ చెప్పారంటే అంతే - చిన్నారి వైద్యానికి రూ కోటి మంజూరు..!!
ముఖ్యమంత్రి జగన్ చెప్పారంటే చేస్తారంతే అనే నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకున్నారు. సీఎం జగన్ తన పెద్ద మనసును చాటుకున్నారు. రెండర్నారేళ్ల చిన్నారి వైద్యానికి ఏకంగా కోటి రూపాయాలను ముఖ్యమం్రి సహాయ నిధి నుంచి మంజూరు చేసారు. ఈ మొత్తం చికిత్సకు అయ్యే ఖర్చుతో పాటుగా ప్రతీ నెలా రూ పది వేలు చొప్పున పెన్షన్ అందించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి స్వయంగా ఆ చిన్నారి ఆరోగ్యం - వైద్యం గురించి జిల్లా కలెక్టర్ కు బాధ్యతలు అప్పగించారు.
నాడు చిన్నారి ఆరోగ్యం పై హామీ
గోదావరి వరదల సమయంలో సమయంలో ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటించారు. ఆ సమయంలో కోనసీమ ప్రాంతంలో తమ చిన్నారి (హానీ) ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ తల్లిదండ్రులు ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎం దృష్టిలో పడ్డారు. కాన్వాయ్ ఆపిన సీఎం జగన్ వారితో ముచ్చటించారు. చిన్నారి ఆరోగ్య సమస్య గురించి అడిగి తెలుసుకుననారు. చిన్నారి బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
తమ చిన్నారి గాకర్స్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించిన తల్లి తండ్రులు..ఈ వ్యాధికి ఇంజెక్షన్ల ద్వారా చికిత్స అందించాలని వివరించారు. ఇందు కోసం కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారంటూ ముఖ్యమంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేసారు.
కోటి రూపాయాలు మంజూరు
వారి ఆవేదన - చిన్నారి ఆరోగ్య పరిస్థితి పైన చలించిన ముఖ్యమంత్రి ఆ చిన్నారి(హానీ) వ్యాధి గురించి తెలుసుకున్నారు. చిన్నారి బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ చిన్నారికి చికిత్స అందించే ఏర్పాటు చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు ఆ బాధ్యత అప్పగించారు. కలెక్టర్ స్వయంగా ఆ చిన్నారి చికిత్సకు సంబంధించిన అన్ని విషయాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
సీఎం సహాయ నిధి నుంచి విడుదల చేసిన ఆ మొత్తంతో అమలాపురం ప్రాంతీయ ఆస్పత్రిలో ఖరీదైన ఆ ఇంజెక్షన్లను కలెక్టర్ స్వయంగా అందచేసారు ఒక్కో ఇంజెక్షన్ రూ 1.25 లక్షలు చొప్పు ఖర్చు అయ్యే 52 ఇంజెక్షన్లు అవసరం గా వైద్యులు చెప్పారు. అందులో భాగంగా తొలుత 13 ఇంజెక్షన్లు అందించారు.

కలెక్టర్ స్వయంగా పర్యవేక్షణ
ఇప్పుడు ఈ చిన్నారికి సీఎం జగన్ ప్రత్యేక ఆదేశాలతో నెలకు రూ 10 వేలు చొప్పిన పెన్షన్ కూడా అందిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లా చిన్నారి తల్లి దండ్రులకు స్వయంగా వెల్లడించారు. చిన్నారి ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించటం.. కోటి రూపాయాల పెద్ద మొత్తంలో ఆర్దిక సాయం అందించటం పైన ఆ చిన్నారి తల్లిదండ్రులతో పాటుగా ఆ ప్రాంత వాసులు సీఎంకు ధన్యవాదాలు చెబుతున్నారు. నెలకు రూ 10వేలు చొప్పున పెన్షన్ ఇవ్వటం ద్వారా ఆ కుటుంబానికి ఇప్పుడు ఆర్దికంగా తోడ్పాటు అందనుంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications