వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన- ప్రధానితో భేటీపై సంతృప్తి : పోలవరంపై కీలక హామీ..!!

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ప్రధానితో దాదాపు గంటకు పైగా సమావేశమైన సీఎం..ఆ తరువాత వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ప్రధానంగా ఆర్దికంగా ఇబ్బందు ల్లో ఉన్న ఏపీకి కేంద్రం నుంచి తోడ్పాటు... రుణ పరిమితి మినహాయింపుల గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా ఏపీకి కేంద్రం నుంచి దక్కాల్సిన ప్రయోజనాలు.. పెండింగ్ అంశాల పైన ప్రధాని ..కేంద్ర మంత్రులతో సీఎం చర్చించారు. ప్రధానితో భేటీ పైన సీఎం జగన్ సంతృప్తి గా ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. గంటా పది నిమిషాల సేపు ఈ సమావేశం జరిగింది.

ప్రధాని సానుకూల స్పందన

ప్రధాని సానుకూల స్పందన


ఆ సమయంలో పోలవరం, కడప స్టీల్‌ ప్లాంట్, తెలంగాణ నుంచి రావాల్సిన రూ.6 వేల కోట్లకుపైగా విద్యుత్తు బకాయిలు, జాతీయ ఆహార భద్రతా చట్టం అర్హుల ఎంపికలో హేతుబద్ధత తదితర అంశాలపై ప్రధానికి సీఎం నివేదించారు. రాజ్యసభ సభ్యుల ఎంపికతో పాటుగా.. రాష్ట్రపతి ఎన్నికల అంశం పైన ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ..బీజేడీ మద్దతు ఇప్పుడు బీజేపీకి రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకం కానుంది. ఇక, జగన్ కు ప్రతిష్ఠాత్మకంగా మారిన పోలవరం అంశం పైన వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు సవరించిన అంచనాలను రూ.55, 548.87 కోట్లుగా నిర్ధారించారు. ఈ అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని..ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఇంకా రూ.31,188 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని సీఎం వివరించారు.

రాజకీయ అంశాలపైన చర్చ

రాజకీయ అంశాలపైన చర్చ

రాష్ట్రంలో గత సర్కారు హయాంలో అదనపు రుణాలకు అనుమతిచ్చారు. కానీ ఇప్పుడు ఆ అదనపు రుణాలకు సరిపడా రాష్ట్ర రుణ పరిమితుల్లో కోత విధిస్తామని అంటున్నారని... దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ప్రధానికి వివరించారు. విధించిన రుణ పరిమితికి మించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ రుణాలు తీసుకోలేదు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రుణాల పరిమితిని సవరించాల్సిందిగా సీఎం కోరారు. తెలంగాణ డిస్కమ్‌లు రూ.6,455.76 కోట్ల మేర బకాయిలను ఏపీ జెన్‌కోకు చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని ప్రధానికి వివరించారు. ఇక, ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశంలోనూ రాష్ట్రంలోని ఆర్దిక పరిస్థితులు..కేంద్రం నుంచి మినహాయింపుల అంశం పైన చర్చించారు. ఆ తరువాత కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశంలో పోలవరం అంశం పైన ప్రధానంగా చర్చ జరిగింది.

అమిత్ షా తో కీలక మంతనాలు

అమిత్ షా తో కీలక మంతనాలు

అయితే, ఈ సమావేశంలో ప్రధానంగా అంచనాలకు ఆమోదంతో పాటుగా.. నిర్మాణంలో తాజా చర్చలు..నిర్దేశిత సమయానికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అంశం పైన కీలక హామీ లభించిందని చెబుతున్నారు. ఆ తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయిన సీఎం జగన్ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు.. కేంద్రం నుంచి తాను ఏం కోరుకుంటున్నాననే అంశం పైన చర్చించినట్లు తెలుస్తోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల పైన ఆయన చర్చించారు. దీంతో..సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకొని అమరావతికి బయల్దేరారు. ఈ సాయంత్రం సీఎం జగన్ గవర్నర్ తో సమావేశం కానున్నారు. ఈ నెల 11న కేబినెట్ విస్తరణ అంశం పైన చర్చించనున్నారు.

English summary
CM Jagan completed his two days Delhi tour on State administrative and political Issues. CM discussed many issues with PM Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X